Bhola Shankar: మెహ‌ర్ ర‌మేష్‌కి వార్నింగ్

Hyderabad: టాలీవుడ్‌లో ఒక్క హిట్ లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్‌కి (meher ramesh) ఓ ఫ్యాన్ నుంచి స్వీట్ వార్నింగ్ వ‌చ్చింది. మెహ‌ర్ డైరెక్ష‌న్‌లో మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) న‌టించిన భోళా శంక‌ర్ (bhola shankar) సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అయితే ట్రైల‌ర్ చూసాక చాలా మంది ఇదేం క్రింజ్‌రా బాబూ.. ఈ రీమేక్ కూడా ఫ్లాపే అని ఒక డెసిష‌న్‌కి వ‌చ్చేసారు. అయితే సినిమా చూసిన వారిలో కొంద‌రు బాగుంది అంటుంటే మ‌రికొంద‌రు ఇంకో ఫ్లాప్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ నేప‌థ్యంలో రాజీవ్ అనే చిరు అభిమాని ఒక‌రు ట్విట‌ర్‌లో మెహ‌ర్‌కి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. గ‌తంలో కూడా త‌న గురించి త‌ప్పుగా మాట్లాడుతున్నాడ‌ని ఇత‌న్ని మెహ‌ర్ ట్విట‌ర్‌లో బ్లాక్ చేసారు. అయితే ఇప్పుడు ఈ రాజీవ్ అనే వ్య‌క్తి భోళా శంక‌ర్ (bhola shankar) చూసాడ‌ట. దాని గురించి చెప్తూ ఇలా ట్వీట్ చేసాడు. “”న‌న్ను ట్విట‌ర్‌లో ఇంకా అన్‌బ్లాక్ చేయ‌నందుకు థ్యాంక్స్ మెహ‌ర్. లేక‌పోతే ఈరోజు మ‌ళ్లీ బ్లాక్ చేసేసేవారు🙏🏻 “” అని ట్వీట్ వేసాడు. ఇత‌ను వేసిన ట్వీట్ కింద సినిమా చూసిన వారు రియాక్ట్ అవుతున్నారు. వేదాళం సినిమా నుంచి ఏ సీన్స్ అయ‌తే ట‌చ్ చేయ‌కూడ‌దో ఆ సీన్స్‌నే ట‌చ్ చేసాడంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.