ట్రెండింగ్‌లో Jailer Disaster..!

Hyderabad: సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ (rajinikanth) న‌టించిన జైల‌ర్ (jailer) సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఎక్క‌డ చూసినా సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వ‌స్తున్నాయి. బీస్ట్ (beast) డిజాస్ట‌ర్ త‌ర్వాత నెల్స‌న్‌ (nelson) డైరెక్ట్ చేసిన ఈ సినిమా రజినీకి, నెల్స‌న్‌కి హిట్ తెచ్చిపెట్టింది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ట్విట‌ర్‌లో జైల‌ర్ డిజాస్ట‌ర్ (jailer disaster) అనే హ్యాష్‌ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పైగా దీనిని ట్రెండ్ చేస్తోంది త‌మిళ (tamil) నెటిజ‌న్సే కావ‌డం గ‌మ‌నార్హం.

ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాలో సూప‌ర్‌స్టార్ (superstar) అనే ట్యాగ్ ఎవ‌రికి ఉండాలి అనే ర‌చ్చ జ‌రుగుతోంది. ర‌జినీకాంత్‌కి (rajinikanth) ఇక ఏజ్ అయిపోయింద‌ని ఆయ‌న అన్నీ స‌ర్దుకుని ఇంట్లో కూర్చోవాలంటూ ద‌ళ‌ప‌తి విజ‌య్ (thalapathy vijay) ఫ్యాన్స్ ర‌చ్చ చేసారు. నిజానికి కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు టాప్‌లో ఉన్న‌ది కేవ‌లం విజ‌య్ కాబ‌ట్టి సూప‌ర్‌స్టార్ ట్యాగ్ ఆయ‌న‌కే ఇవ్వాల‌ని డిమాండ్ చేసారు. మ‌రోప‌క్క ర‌జినీకాంత్ కూడా ఈ సూప‌ర్‌స్టార్ ట్యాగ్ గురించి జైల‌ర్ ఆడియో లాంచ్‌లో ప్ర‌స్తావించారు. ఈ ట్యాగ్‌తోనే ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని త‌న‌కు ఎలాంటి ట్యాగ్ అవ‌స‌రం లేద‌ని అన్నారు. పైగా జైల‌ర్ డిజాస్టర్ హ్యాష్‌ట్యాగ్‌పై (jailer disaster) క్లిక్ చేస్తే చాలా మటుకు విజ‌య్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది.

jailer disaster
Jailer Disaster