Flying Kiss ఎవ‌రికి ఇచ్చారు?

Delhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  ఫ్ల‌యింగ్ కిస్ (flying kiss) ఇచ్చారంటూ పార్ల‌మెంట్ (parliament) ద‌ద్ద‌రిల్లిపోతోంది. గౌర‌వ‌నీయ‌మైన ప‌దవిలో ఉంటూ ఇలాగేనా ప్ర‌వ‌ర్తించేది అని BJP మండిప‌డుతోంది. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి స్మ్ర‌తి ఇరానీ ఆయ‌న‌పై (rahul gandhi)ఫిర్యాదు చేసిన లెట‌ర్‌ను స్పీక‌ర్‌కు స‌మ‌ర్పించారు. అస‌లు రాహుల్ ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చిన మాట నిజ‌మేనా? ఈ ప్ర‌శ్న కాంగ్రెస్ వ‌ర్గాల‌ను అడిగితే.. రాహుల్ ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చింది పార్ల‌మెంట్‌లోని సీట్ల‌కు కానీ వాటిపై కూర్చున్న‌వారికి కాద‌ని అంటున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ ఆల్రెడీ ఒక కేసును నెత్తిపై వేసుకుని రాజ్య‌స‌భ ఎంపీ ప‌ద‌విని నాలుగు నెల‌ల పాటు దూరం చేసుకున్న రాహుల్ ఇక నుంచి చాలా జాగ్ర‌త్తగా ప్ర‌వ‌ర్తించాల్సిన అవ‌స‌రం ఉంది.

మ‌ణిపూర్ ఘ‌ర్ష‌ణ గురించి డిబేట్‌లో కొద్ది సేపు మాత్ర‌మే పాల్గొన్న రాహుల్ గాంధీ.. తాను అడ‌గాల‌నుకున్న ప్ర‌శ్న‌ల‌ను అడిగేసి రాజ‌స్థాన్‌లో ఏదో ప‌ని ఉంద‌ని వాకౌట్ చేసారు. లోక్ స‌భ నుంచి బ‌య‌టికి వెళ్తూ ఆయ‌న ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చారు. అయితే ఆయ‌న ఏ కుర్చీల వైపైతే ఫ్ల‌యింగ్ కిస్ (flying kiss) ఇచ్చారో అక్క‌డ BJPకి చెందిన కొంద‌రు మ‌హిళా ఎంపీలు కూడా ఉన్నారు. వారిలో కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ ఒక‌రు. అస‌లే ఎప్పుడెప్పుడు రాహుల్ దొర‌కుతాడా అని ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ దొరికింది. దాంతో చెడుగుడు ఆడేస్తున్నారు. రాహుల్‌ని లోక‌స‌భ‌లో అడుగుపెట్ట‌నివ్వ‌కూడ‌దు అని డిమాండ్ చేస్తున్నారు.

అయితే రాహుల్ ఫ్ల‌యింగ్ కిస్ (flying kiss) ఇస్తూ.. గుడ్ బై మై డియ‌ర్ బ్ర‌ద‌ర్స్ అండ్ సిస్ట‌ర్స్ అని అన్నారే త‌ప్ప స్మృతి ఇరానీని చూస్తూ అలా చేయ‌లేద‌ని కాంగ్రెస్ నేత‌లు చెప్తున్నారు. ఇలాంటి చండాల‌మైన ఘ‌ట‌న చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు పార్ల‌మెంట్‌లో జ‌ర‌గ‌లేద‌ని స్మృతి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఇదే పార్ల‌మెంట్‌లో మ‌హిళ‌ల సంర‌క్ష‌ణ కోసం బిల్లులు పాస్ చేస్తార‌ని, అలాంటి మ‌హిళ‌ల ప‌ట్ల ఓ వ్య‌క్తి ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టం సిగ్గు చేట‌ని అన్నారు. ఈ ఒక్క ఘ‌ట‌నతో అవిశ్వాస తీర్మాన డిబేట్ కాస్తా డైవ‌ర్ట్ అయిపోయింది. ఇక రేప‌టి నుంచి రాహుల్ చేసిన ఈ ఒక్క ప‌ని గురించే పార్ల‌మెంట్‌లో చ‌ర్చిస్తారు కానీ మ‌ణిపూర్ ఘ‌ట‌న గురించి అస‌లు ప‌ట్టించుకోక‌పోవ‌చ్చు.