Undavalli Arun Kumar: చిరంజీవి సలహా ఇస్తే తప్పేంటి?
Hyderabad: మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) YSRCP ప్రభుత్వ తీరుపై చేసిన కామెంట్స్ వంద శాతం కరెక్ట్ అని అన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ (undavalli arun kumar). రాష్ట్ర విభజన జరుగుతుంటే ఆంధ్ర ప్రదేశ్ తరపున పార్లమెంటులో, బయట బలంగా మాట్లాడిన వ్యక్తి చిరంజీవి అని ఉండవల్లి అన్నారు. ఆయన ఆరోజు మాట్లాడటం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చిందని తెలిపారు. అలాంటి వ్యక్తి ప్రత్యేక హోదాపై పోరాడాలని YSRCPకి సలహా ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు.