Parliament: రాహుల్ ఫ్లయింగ్ కిస్…మహిళా ఎంపీ మండిపాటు!
Delhi: రాహుల్ గాంధీ (rahul gandhi) మరో వివాదంలో చిక్కుకున్నారు. పార్లమెంట్లో (parliament) అడుగుపెట్టిన రాహుల్.. మహిళా ఎంపీలు కూర్చునే సీట్ల వైపు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారట. దాంతో కేంద్రమంత్రి స్మ్రతి ఇరానీతో (smriti irani) పాటు BJP మహిళా మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీచపు ఆలోచనలు ఉన్న వ్యక్తే ఇలాంటి పనులకు పాల్పడుతుంటారని స్మృతి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాహుల్‌పై ఫిర్యాదు చేస్తున్నట్లు ఓ లెటర్‌ను స్పీకర్‌కు సమర్పించారు.