Namrata shirodkar: నువ్వే.. ఎప్ప‌టికీ నువ్వే కావాలి..!

Hyderabad: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, న‌మ్ర‌త శిరోద్క‌ర్‌ల (namrata shirodkar) జంట ఎంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. టాలీవుడ్ ప‌వ‌ర్ క‌పుల్ అయిన మ‌హేష్‌, న‌మ్ర‌త‌ల బాండ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. చాలా మంది వీరి నుంచి స్ఫూర్తి పొందాలి. ఈరోజు మ‌హేష్ బ‌ర్త్‌డే (mahesh babu birthday) సంద‌ర్భంగా న‌మ‌త్ర ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో వైర‌ల్ అవుతోంది. స్కాట్‌లాండ్‌లో ఫ్యామిలీతో వెకేష‌న్‌కు వెళ్లారు మ‌హేష్‌. అక్క‌డ ఓ టెర్రేస్‌పై మహేష్‌ను వెన‌క నుంచి హ‌గ్ చేసుకున్న క్యూట్ ఫొటోను న‌మ్ర‌త ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. హ్యాపీ బ‌ర్త్‌డే MB!! ఇప్పుడు.. ఎప్పుడూ నువ్వే.. నువ్వు మాత్ర‌మే కావాలి అని క్యాప్ష‌న్ ఇచ్చారు.