Meher Ramesh: ఇన్‌డైరెక్ట్‌గా సారీ చెప్పేసారు..!
Hyderabad: దర్శకుడు మెహర్ రమేష్ (meher ramesh) తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన వేదాళం (vedalam) సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి అజిత్ (ajith) ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఓ రేంజ్‌లో ట్రోలింగ్ స్టార్ట్ చేసారు. దాంతో నిన్న మెహర్ రమేష్ ఇన్‌డైరెక్ట్‌గా సారీ చెప్తూ ఓ ట్వీట్ పెట్టారు.
“” నేను 2015లో వచ్చిన వేదాళం చూసాను. నాకు సినిమా చాలా నచ్చింది. దర్శకుడు శివ ఓ అన్న చెల్లి మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించిన విధానం ఎంతో నచ్చింది. ఇదే సెంటిమెంట్‌ని తెలుగు ఆడియన్స్‌కి కూడా ఉంటుంది. దానినే నేను భోళా శంకర్‌లో చూపించాలని అనుకున్నాను. 2009లో అజిత్ సర్ యాక్ట్ చేసిన బిల్లాను తెలుగులో ప్రభాస్‌తో రీమేక్ చేసాను. ఇప్పుడు మళ్లీ అజిత్ సర్ యాక్ట్ చేసిన వేదాళంని రీమేక్ చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. భోళా శంకర్ 11న రిలీజ్ అవబోతోంది “” అని ట్వీట్ చేసారు.
ఇంతకీ మెహర్ రమేష్ చేసిన కామెంట్స్ ఏంటంటే.. భోళా శంకర్ ట్రైలర్ చూసాక చాలా మంది చిరు పవన్‌ను ఇమిటేట్ చేయడం ఏంటి? ఇదేం క్రింజ్‌రా (cringe) బాబూ అంటూ కామెంట్స్ చేసారు. అసలు క్రింజ్‌కి మీనింగ్ తెలీనివారు కూడా క్రింజ్ అని కామెంట్స్ చేసేస్తున్నారని అన్నారు. వేదాళంలో అజిత్ ఎన్నో క్రింజ్ సీన్లలో నటించారని, కానీ వాటిని నేను భోళా శంకర్‌లో మాడిఫై చేసానని అన్నారు. దాంతో ముందుగా ఊహించినట్లుగానే అజిత్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేసారు. దాంతో మెహర్ రమేష్ సినిమా రిలీజ్‌కి ముందు ఎందుకొచ్చిన గొడవ అని ఒక్క ట్వీట్‌తో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.