Meher Ramesh: వేదాళంపై షాకింగ్ కామెంట్స్
Hyderabad: దర్శకుడు మెహర్ రమేష్ (meher ramesh) తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన వేదాళం (vedalam) సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసారు. అజిత్ (ajith) నటించిన ఈ సినిమాను తెలుగులో చిరంజీవితో (chiranjeevi) భోళా శంకర్ (bhola shankar) టైటిల్‌తో తెరకెక్కించారు మెహర్. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసాక చాలా మంది చిరు పవన్‌ను ఇమిటేట్ చేయడం ఏంటి? ఇదేం క్రింజ్‌రా (cringe) బాబూ అంటూ కామెంట్స్ చేసారు.
అసలు క్రింజ్‌కి మీనింగ్ తెలీనివారు కూడా క్రింజ్ అని కామెంట్స్ చేసేస్తున్నారని అన్నారు. వేదాళంలో అజిత్ ఎన్నో క్రింజ్ సీన్లలో నటించారని, కానీ వాటిని నేను భోళా శంకర్‌లో మాడిఫై చేసానని తెలిపారు. సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందన్న ధీమా వ్యక్తం చేసారు. రీమేక్‌లు ఎందుకు తీస్తున్నారు అడిగితే.. ఒక భాషలో ఒక సినిమా మంచి హిట్ అయిందంటే ఆ సినిమాను ఇతర భాషల్లో తీసి ప్రేక్షకులకు ఎందుకు అందించకూడదు అని మెహర్ (meher ramesh) చిరుతో అన్నారట. ఈ విషయాన్ని స్వయంగా చిరునే మొన్న జరిగిన భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు. అసలు మెహర్‌కి సొంత కంటెంట్‌తో ఉన్న సినిమాలు తీయడం చేత కాదని ఆయనే ఇన్‌డైరెక్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పేసారు. పెద్ద హీరోలను పెట్టి సినిమా తీస్తేనే ఆడియన్స్ థియేటర్లకు వస్తారని కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటే క్రౌడ్ పుల్లింగ్ చాలా కష్టమని అన్నారు.
తెలుగులో ఒక్క హిట్ లేదన్న బాధ ఆయనలో చాలా క్లియర్‌గా కనిపిస్తోంది. ఇలాంటి కామెంట్స్ చేయాలంటే ముందు సినిమా హిట్ అవ్వాలి. హిట్ అయ్యాక ఎవరైతే క్రింజ్ అన్నారో వారికి మొహం పగలగొట్టినట్లు ఆన్సర్ ఇవ్వచ్చు. కానీ సినిమా రిలీజ్ అవ్వడానికి కొన్ని రోజుల ముందు ఇలా అజిత్ నటించిన సినిమాలో క్రింజ్ సీన్లు ఉన్నాయి అని మాట్లాడటం సబబు కాదు. ఎందుకంటే భోళా శంకర్ అటు ఇటు అయ్యి ఫ్లాప్ అయితే మాత్రం ట్రోల్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో మెహర్ ఊహించలేరు కూడా. అసలే తమిళ ఆడియన్స్ ఎప్పుడెప్పుడు మన సినిమాలు ఫ్లాప్ అయితే ట్రోల్ చేద్దామా అని సోషల్ మీడియాలో రెడీగా ఉంటారు. వారికి మెహర్ రమేష్ (meher ramesh) ఛాన్స్ ఇచ్చినట్లు అయిపోయింది.