Marriage: ప్రేయసి వదిలేసిందని.. బొమ్మతో పెళ్లి..!
Hyderabad: ఇది పిచ్చికి పరాకాష్ఠ. ఆడపిల్లలే దొరకనట్లు ఓ వ్యక్తి బొమ్మను పెళ్లి (marriage) చేసుకున్నాడు. పైగా అది ఓ చక్కని బొమ్మనా అంటే చెత్తలో దొరికిన బొమ్మ. ఈ ఘటన కొలంబియాలో చోటుచేసుకుంది. అయితే పాపం ఆ వ్యక్తి ఇలా చేయడానికి వెనక ఓ బలమైన కారణం ఉంది. కొలంబియాకు (columbia) చెందిన క్రిస్టియన్ అనే వ్యక్తి ఓ అమ్మాయితో ప్రేమలో ఉండేవాడు. కానీ ఆ అమ్మాయి వేరొకరి కోసం ఇతన్ని వదిలేసి వెళ్లిపోయింది.
దాంతో ఆడవాళ్లపై అసహ్యం వేసి తనను ఎప్పటికీ మోసం చేయకుండా తనతోనే ఉండే అమ్మాయిని పెళ్లి (marriage) చేసుకోవాలని అనుకున్నాడు. అలాంటి అమ్మాయి దొరకలేదో ఏమో ఏకంగా చెత్తలో దొరికిన ఓ ఆడబొమ్మను తెచ్చుకుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయితే చేసుకున్నాడు కానీ దాంతో పిల్లల్ని కనలేడు కదా..? అందుకే ఓ మూడు చిన్న పిల్ల బొమ్మలను కొనుక్కుని వాటినే తన బిడ్డలుగా చూసుకుంటున్నాడు. ఆ బొమ్మకు నటాలీ అనే పేరు కూడా పెట్టాడు. ఇంట్లో జరిగే శుభకార్యాలకు నటాలీని, పిల్లల్న కూడా వెంటబెట్టుకుని వెళ్తాడట.
అయితే క్రిస్టియన్ ఒక్కడే కాదు.. గతంలో ఇలా బొమ్మలను పెళ్లిళ్లు చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారికి ఆబ్‌జెక్టోఫైలియా అనే వ్యాధి ఉంటుందట. అంటే ఆబ్‌జెక్ట్స్ (వస్తువులు)ల పట్ల మెంటల్‌గా, సెక్సువల్‌గా ఆకర్షితులు అవుతారట.