Bhola Shankar రిలీజ్‌కి ముందు ప్రొడ్యూస‌ర్‌పై కేసు

Hyderabad: మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) న‌టించిన భోళా శంక‌ర్ (bhola shankar)  సినిమా నిర్మాత అనిల్ సుంక‌ర  (anil sunkara) వివాదంలో చిక్కుకున్నారు. ఈ నెల 11న సినిమా రిలీజ్ అవ‌నుంది. అయితే అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్  (agent) సినిమాకు కూడా అనిల్ సుంక‌రే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్ గాయ‌త్రి స‌తీష్ (gayatri satish) అనిల్‌పై కేసు వేసారు. ఏజెంట్ సినిమాకు సంబంధించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్, క‌ర్ణాటక రైట్స్‌ని రూ.30 కోట్ల‌ను కొనుగోలు చేసాన‌ని, కానీ ఇప్ప‌టివ‌ర‌కు రూ.1.5 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయ‌ని ఆరోపించారు. ఏజెంట్ రైట్స్ గొడ‌వ స‌ర్దుమ‌ణ‌గక ముందే భోళా శంక‌ర్ (bhola shankar) రైట్స్‌ని త‌న‌కు తెలీకుండా వేరే డిస్ట్రిబ్యూట‌ర్‌కు అమ్మేసార‌ని ఆరోప‌ణ‌లు చేసారు. త‌న‌కు జ‌రిగిన న‌ష్టానికి అనిల్ సుంక‌ర వ‌డ్డీతో స‌హా ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.