Article 370: ఒకే రోజు 21 మంది కాంగ్రెస్‌లోకి..!

Delhi: సోమ‌వారం నాడు ఒకే సారి 21 మంది నేత‌లు తిరిగి కాంగ్రెస్ (congress) పార్టీలో చేరారు. పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే స‌మ‌యంలో వీరంతా తిరిగి కాంగ్రెస్‌లో చేరిన‌ట్లు పార్టీ ప్ర‌క‌టించింది. దీనికి కార‌ణం DPAP (డెమోక్ర‌టివ్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ) అధినేత గులామ్ న‌బీ ఆజాద్ (ghulam nabi azad) చేసిన వ్యాఖ్య‌లే కార‌ణం. ఆర్టిక‌ల్ 370 (article 370) ర‌ద్దు గురించి ఆయన చేసిన కామెంట్స్‌ను వ్య‌తిరేకిస్తూ అప్ప‌టివ‌ర‌కు DPAPలో ఉన్న‌వారంతా కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు.

ఇంత‌కీ గులామ్ న‌బీ ఆజాద్ ఏమ‌న్నారంటే.. “” ఎవరైతే ఆర్టిక‌ల్ 370ని వ్య‌తిరేకిస్తున్నారో వారికి జ‌మ్ము క‌శ్మీర్‌లో ఉన్న ప‌రిస్థితి గురించి తెలీడంలేదు. జమ్మూ కాశ్మీర్ చరిత్ర, భౌగోళికం గురించి కూడా తెలీదు. ఆర్టికల్ 370 అనేది నిర్దిష్ట ప్రాంతం, ప్రావిన్స్ లేదా మతం కోసం ఉద్దేశించినది కాదు. అందరికీ సమానంగా ఉపయోగకరంగా ఉంది “” అన్నారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. గులామ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టే అర్థం అవుతోంది ఆయ‌న DNA ఎక్క‌డిదోన‌ని అంటూ విమ‌ర్శించారు.

“” 2019లో గులామ్ ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేయాలంటూ రాజ్య‌స‌భ‌లో తెగ ర‌చ్చ చేసారు. అలాంటి ఆయ‌నే ఈరోజు ఆర్టిక‌ల్ 370ని ఎందుకు ర‌ద్దు చేసార‌ని అంటున్నారు. పార్ల‌మెంట్ నుంచి వెళ్లిపోయిన త‌ర్వాత కూడా ఆయ‌న ఢిల్లీ బంగ్లాలో ఇంకా ఎలా నివ‌సిస్తున్నారో ఆయ‌నే చెప్పాలి “” అని కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జైరామ్ ర‌మేష్ తెలిపారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల ద్వారా నిజం స్వ‌రూపం తెలిసి ఒక‌ప్పుడు కాంగ్రెస్ నుంచి DPAP పార్టీలోకి వెళ్లిపోయిన వారు మ‌ళ్లీ కాంగ్రెస్‌లో చేరార‌ని ఈ సంద‌ర్భంగా జైరామ్ ర‌మేష్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.