Chiranjeevi: మామీద పడతారేంటి సర్..?
Hyderabad: మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) YSRCP ప్రభుత్వంపై సెటైర్లు వేసారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి సర్ అని ప్రశ్నించారు. వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల ఫంక్షన్‌ను నిర్వహించిన సందర్భంగా చిరు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇటీవల పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో (bro) సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై (ambati rambabu) సెటైర్ వేసినట్లు క్యారెక్టర్ క్రియేట్ చేసారని రాంబాబు రచ్చ రచ్చ చేసారు. బ్రో ఫండింగ్పై పవన్ (pawan kalyan) తీసుకున్న రెమ్యునరేషన్‌పై ఈడీకి ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపారు. దీని గురించి చిరంజీవి ప్రస్తావించారు.
“” ప్రత్యేక హోదా గురించి కానీ, రోడ్ల నిర్మాణం గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ, పేదవారి కడుపు నిండే విషయం కానీ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం గురించి కానీ, మీలాంటి వాళ్లు ఇలాంటి పెద్ద పెద్ద విషయాల గురించి కలగజేసుకుని, అవన్నీ రాష్ట్రాలకు వచ్చే చూస్తే ప్రతి ఒక్కళ్లు మీకు తలవంచి నమస్కరిస్తారు. అవన్నీ వదిలేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి సర్? ఇదేదో పెద్ద సమస్య అన్నట్లు దేశ వ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించకండి “” అని అన్నారు చిరు. (chiranjeevi)