Gayathri Mantram: ఆ ర‌హ‌స్యం ఏంటి?

Hyderabad: గాయత్రి మంత్రం (gayathri mantram) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పూజ‌లు ఎక్కువ‌గా చేసేవారు ఉద‌యాన్నే ఈ గాయత్రి మంత్రం విన‌నిదే వారికి రోజు మొద‌లైన‌ట్లు ఉండ‌దు. గాయత్రి మంత్రానికి అధిప‌తి సూర్యుడు. అందుకే సంధ్యావ‌ద‌నం చేస్తున్న స‌మ‌యంలోనే ఈ మంత్రాన్ని జ‌పిస్తారు. మ‌న‌కు తెలిసి గాయత్రి మంత్రం ఉండేది మూడు పాదాలే. కానీ నాలుగో పాదం కూడా ఉంది. అది ఎంతో ప‌విత్ర‌మైన‌ది, ర‌హ‌స్యమైన‌ద‌ట‌. స‌ర్వ‌సంగ ప‌రిత్యాగం చేసిన‌వారికి మాత్ర‌మే నాలుగో పాదాన్ని ఉప‌దేశిస్తార‌ట‌.

గాయ‌త్రి మంత్రం

ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్

అర్థ‌మేంటి?

ఓం – ప్ర‌ణ‌వ‌నాదం
భూః – భూలోకం, దేహం, హృద‌యం
భూవః – ప్రాణ‌శక్తి
సువః – స్వ‌ర్గ లోకం
త‌త్ – ఆ
స‌వితుర్ – స‌మ‌స్త లోకం
వ‌రేణ్యం – వ‌ర్తింప త‌గిన‌ది
భ‌ర్గో – అజ్ఞానం, అంధ‌కారం తొల‌గించున‌ది
దేవ‌స‌య – స్వ‌యం ప్రకాశ‌కుడైన బ్ర‌హ్మ‌ను
ధీమ‌హీ – ధ్యానించుచున్నాను
ధీయోయోనః ప్ర‌చోద‌యాత్ – ప్రార్ధిస్తున్నాను (gayathri manthram)