Bandi Sanjay: నా ప‌ర్మ‌నెంట్ అడ్రెస్ అదే..!

Hyderabad: BJP నేత‌, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ (bandi sanjay) చేసిన ట్వీట్ ఒక‌టి వైర‌ల్ అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో సీఎం KCR, ఐటీ శాఖ మంత్రి KTR ఇన్‌డైరెక్ట్‌గా బండి సంజ‌య్‌పై కామెంట్స్ చేసారు. “” హైద‌రాబాద్ మునిగింది, న‌ష్టం వ‌చ్చింది అంటే బండి పోతే బండి ఇస్తాం.. గుండు పోతే గుండిస్తాం అని మాట్లాడిన‌వాళ్లు బండి లేదు నా గుండు లేదు ఎవ‌డు ఎక్క‌డ పోయిండో ప‌త్తా లేదు. ఎవ్వరూ రాలే. చివ‌రికి మేమే చేసాం “” అని KCR అన్నారు.

ఆ త‌ర్వాత KTR మాట్లాడుతూ.. “” నిన్న మొన్న‌టి దాకా ఇక్క‌డ ఒకాయ‌న ఉండె అధ్య‌క్ష‌.. వినోదం అందించిండు. హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో బండి పోతే బండి ఫ్రీ మ‌నిషి పోతే మనిషి ఫ్రీ కారు పోతే కారు ఫ్రీ ఏది పోతే అది ఫ్రీ అన్నాడు. ఆఖ‌రికి ఆ బండే ఇప్పుడు షెడ్‌కి పోయింది పాపం. ఎక్క‌డుంటున్నాడో పాపం తెలీదు “” అన్నారు. దీనిపై బండి సంజ‌య్ స్పందిస్తూ (bandi sanjay).. “” నేను లేని చోట కూడా న‌న్ను త‌లుచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జ‌స్ట్ రికార్డ్ కోసం చెప్తున్నా.. నా ప‌ర్మ‌నెంట్ అడ్రెస్ / షెడ్: బండి కేరాఫ్ క‌రీంన‌గ‌ర్ “” అని ట్వీట్ చేసారు.