1000 Crores: కుంభ‌స్థ‌లం బ‌ద్ద‌ల‌కొడ‌తారా?

Hyderabad: టాలీవుడ్ నుంచి రిలీజ్ అవ‌నున్న సినిమాల్లో ఐదు ప్యాన్ ఇండియ‌న్ సినిమాలు ఉన్నాయి. ఈ ఐదు సినిమాల‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌ర‌ల్డ్ వైడ్ రూ.1000 కోట్లు క‌లెక్ష‌న్లు రాబ‌ట్టే కెపాసిటీ ఉంది. అవేం సినిమాలంటే.. (1000 crores)

స‌లార్, కల్కి (salaar, kalki)
యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) న‌టిస్తున్న రెండు ప్యాన్ ఇండియ‌న్ సినిమాలు ఇవి. స‌లార్ సినిమాను ప్ర‌శాంత్ నీల్, క‌ల్కిని (kalki 2898 ad) నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రెండు కానీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క్లిక్ అయితే రూ.1000 కోట్లు గ్యారెంటీ అని అంటున్నారు సినీ ఎక్స్‌ప‌ర్ట్స్.

మ‌హేష్- రాజ‌మౌళి ఫిలిం (mahesh babu- rajamouli)
వీరిద్దరి కాంబినేష‌న్‌లో (ssmb 29) సినిమా రాబోతోంది అన‌గానే బాక్సాఫీస్ లెక్క‌లు ఆల్రెడీ వేసేసారు. ఎందుకంటే ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్ రాజ‌మౌళి సినిమా తీసేట‌ప్పుడే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ రూ.500కి త‌గ్గ‌కుండా ఉండేలా ప్లాన్ చేస్తారు. ఇక మ‌హేష్ బాబుని పెట్టి తీస్తున్నాడంటే రూ.1000 కోట్లు రావాల్సిందే. ఫ్యాన్స్ టూ మ‌చ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకున్నారు. త్వ‌ర‌లో ఈ సినిమాకు సంబంధించిన వ‌ర్క్ షాప్స్ కూడా స్టార్ట్ అవ‌బోతున్నాయి. (1000 crores)

పుష్ప‌- ది రూల్ (pusha the rule)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) న‌టించిన పుష్ప సినిమా ప్యాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌లో దూసుకెళ్లింది. ఇప్పుడు అంత‌కుమించిన ఎక్స్‌పెక్టేషన్స్‌తో పుష్ప‌- ది రూల్ తీస్తున్నారు సుకుమార్. పార్ట్ వ‌న్‌కి మించిన క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌న‌డంలో ఏమాత్రం డౌట్ లేదు. కాక‌పోతే రూ.1000 కోట్లు రాబ‌ట్టే స‌త్తా ఉన్న సినిమాల్లో ఇదీ ఒక‌టి. మ‌రి ఆ మార్క్‌ని చేరుకుంటుందో లేదో చూడాలి.

వార్-2 (war 2)
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ (hrithik roshan) సినిమా వస్తోందంటేనే ఒక రూ.500 కోట్ల బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌ని ముందే అంచ‌నా వేసేసుకుంటారు. అలాంటిది ఆయ‌న‌తో మ‌న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్  (jr ntr) జ‌త‌క‌డితే? క‌చ్చితంగా రూ.1000 కోట్లు రాబ‌ట్టే సినిమా అవుతుంది. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో ఎప్పుడూ చూడ‌ని హై యాక్ష‌న్ సీన్స్‌లో న‌టిస్తార‌ని ఆల్రెడీ అయాన్ ముఖ‌ర్జీ హైప్ ఇచ్చేసారు. అలాంట‌ప్పుడు రూ.1000 కోట్లు క‌లెక్ష‌న్స్ ఎక్స్‌పెక్ట్ చేయడంలో ఏమాత్రం త‌ప్పు లేదు.