Viral News: చెత్తలో దొరికిన 30 ఐఫోన్లు..!
Hyderabad: ఎవరికైనా ఐఫోన్ దొరికితే హాయిగా సిమ్ మార్చేసి వాడుకోవడమో లేదా అమ్ముకోవడమో చేస్తుంటారు (viral news). దానిని ఓనర్ దగ్గరికి చేర్చాలనే ఉద్దేశం చాలా తక్కువ మందికి ఉంటుంది. అదే ఏకంగా 30 ఐఫోన్లు దొరికితే..? (iphone) లైఫ్ సెటిల్ అయిపోయినట్లే. కానీ ఓ అన్నా చెల్లి కలిసి ఆ ఐఫోన్లను ఓనర్లకే అందించాలని అనుకున్నారు. ఈ ఘటన చైనాలో (china) చోటుచేసుకుంది. హెనన్ ప్రావిన్స్‌కి చెందిన ఓ అన్నా చెల్లికి వారు ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గర ఉన్న చెత్త కుప్పలో ఏకంగా 30 ఐఫోన్ 14 ఫోన్లు దొరికాయట. అది చూసి వారు షాకయ్యారు.
వెంటనే వాటిని ఓ కవరులో వేసి స్థానిక పోలీసులకు ఫోన్ చేసారు. వారు వచ్చి ఐఫోన్లను కలెక్ట్ చేసుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టగా లియూ అనే కొరియర్ సర్వీస్ నిర్వాకం అని తెలిసింది. ఆ సర్వీస్ వారు ఫోన్లు పెట్టిన బాక్సులను వ్యాన్‌లోకి ఎక్కించడం మర్చిపోయారట. దాంతో ఆ ఫోన్లను డెలివరీ చేయాల్సిన సంస్థ లియూపై దాదాపు 50 వేల డాలర్ల వరకు జరిమానా విధించింది. మరో విషయం ఏంటంటే.. లియూ కంపెనీలో క్లీనర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ ఐదు ఐఫోన్ బాక్సులను దొంగిలించిందట. కానీ ఐఫోన్ కేసింగ్స్ని ఎలా వాడాలో ఆమెకు తెలీక ఆ బాక్సులను చెత్త కుప్పలో పడేసినట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది. మొత్తానికి దాదాపు 15 బాక్సుల ఐఫోన్లు చెత్త కుప్పలో దొరికాయి. (viral news)