Jailer: బుకింగ్స్‌లో వెనుక‌బ‌డిన భోళా శంక‌ర్

Hyderabad: ఒకే వారంలో ఇద్ద‌రు టాప్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ (bhola shankar), రెండోది సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన జైల‌ర్ (jailer). అయితే బుకింగ్స్ విష‌యంలో భోళా శంక‌ర్ వెన‌క‌బ‌డిపోయింది. హైద‌రాబాద్‌లో భోళా శంక‌ర్ సినిమా కంటే జైల‌ర్ సినిమాకే బుకింగ్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. జైల‌ర్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 50 ల‌క్ష‌లు ఉంది. కానీ భోళాకి 40 ల‌క్ష‌లే ఉంది.

చూడ‌బోతే మోహ‌ర్ ర‌మేష్ (meher ramesh) క‌లాఖండం ఎలా ఉండబోతోందో ఆడియ‌న్స్‌కి ట్రైల‌ర్‌తోనే అర్థ‌మైపోయిన‌ట్లుంది. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ అదే గ్రేస్, స్వాగ్‌తో సినిమాలు తీస్తున్న మెగాస్టార్‌ని (chiranjeevi) పెట్టుకుని అన‌వ‌సరంగా రీమేక్‌లు తీస్తూ ఆయ‌న ఇజ్జ‌త్ తీసేస్తున్నారు. పైగా కంటెంట్ ఉన్న సినిమాలు తీసే స‌త్తా త‌న‌కు లేద‌ని మెహ‌ర్ ర‌మేష్ ఆల్రెడీ ఓ ఇంట‌ర్వ్యూలో ఇన్‌డైరెక్ట్‌గా ఒప్పేసుకున్నారు. కంటెంట్ ఉన్న సినిమాల కంటే క్రేజ్ ఉన్న టాప్ హీరోల ద్వారానే థియేట‌ర్ల‌కు ఆడియ‌న్స్‌ని ర‌ప్పించ‌వచ్చు అని మెహ‌ర్ అన్నారు. దీనిని బట్టి చూస్తే రీమేక్‌లు ఏరుకొచ్చి సినిమాలు తీయ‌డం త‌ప్ప సొంత బుర్ర పెట్టి ఓ మంచి క‌థ రాయాల‌న్న ఆలోచ‌న ఆయ‌న‌కు లేద‌ని క్లియ‌ర్‌గా తెలుస్తోంది.