Broom: చీపురులో పోష‌క విలువ‌లు ఉన్నాయ‌ట‌!

Hyderabad: ఇల్లు ఊడ్చ‌డానికి వాడే చీపుర్ల‌లో (broom) పోష‌క విలువ‌లేంటి అనుకుంటున్నారా? అవును. ఈ మ‌ధ్య‌కాలంలో తినే వ‌స్తువుల‌పై ఏమేం పోష‌కాలు ఉన్నాయో క్లియ‌ర్‌గా రాస్తున్నారు. కానీ చీపురులో కూడా పోష‌క విలువ‌లు ఉన్నాయ‌ని ఓ కంపెనీ రాసింది. ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో తెలీదు కానీ ఓ నెటిజ‌న్ సోష‌ల్ మీడియాలో చీపురు క‌వ‌ర్‌ను పోస్ట్ చేసారు. ఆ చీపురు క‌వ‌రుపై న్యూట్రిషిన‌ల్ ఫాక్ట్స్ అని రాసుంది. ఒక్కో చీపురులో 150 క్యాలొరీలు ఉంటాయ‌ట‌. అంతేకాదు ఫ్యాట్, కొలెస్ట్రాల్, ప్రొటీన్లు ఎంత శాతం ఉంటాయో కూడా ప్రింట్ చేసారు. అస‌లు చీపుర్ల‌లో పోష‌క విలువ‌లు ఉండ‌ట‌మేంట్రా అంటూ నెటిజ‌న్లు బుర్ర గోక్కుంటున్నారు.