Aloevera: వాస్తు ప్రకారం అలోవెరా ఎక్కడుండాలి?
Hyderabad: ఇంట్లో ఎక్కువగా పెంచుకునే మొక్కల్లో అలోవెరా (aloevera) ఒకటి. అయితే ఈ మొక్కను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని అంటున్నారు వాస్తు నిపుణులు. అసలు ఈ మొక్క ఎక్కడ పెడితే మంచిదో తెలుసుకుందాం.
*అలోవెరాలో ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీలు ఉన్నాయి. అందుకే ఈ మొక్కను గ్వపార్థ, గ్రిత్ కుమారి, క్వార్గందల్ అని కూడా పిలుస్తారు.
*వాస్తు శాస్త్రం ప్రకారం అలోవెరా ఇంట్లో ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగుంటాయట.
*తూర్పు లేదా ఉత్తరం దిక్కుల్లో అలోవెరా మొక్కను పెడితే ఇంటికి ఎంతో మంచిది. (aloevera)
*అలోవెరా ఇంట్లో ఉంటే ఎంతో అదృష్టం అని. విఘ్నాలను తొలగించడంలో ఎంతో సహాయపడుతుందని నమ్ముతారు.
*మీరు పని చేసే ప్రదేశాల్లో చిన్న అలోవెరా మొక్కను పెట్టుకుంటే ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయట. మీ కెరీర్ కూడా బాగుంటుందట.
*అలోవెరాను పడమర దిక్కులో పెడితే ఆరోగ్యం బాగుంటుంది, ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి. అదే తూర్పు దిశగా పెడితే.. సూర్యుడు ఉదయించే దిక్కు కాబట్టి చర్మ సమస్యలు రాకుండా ఉంటాయట. (aloevera)
*అలోవెరా నుంచి మంచి బెనిఫిట్స్ పొందాలంటే కాస్త వెలుతురు తగిలే ప్రదేశాల్లో పెడితే మంచిది.