ప్రభాస్ అలా అడిగేసరికి భయపడ్డా: పెళ్లిపై కృతి సనన్ కామెంట్స్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా.. బబ్లీ గర్ల్ కృతి సనన్ కాంబినేషన్లో ఆదిపురుష్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సీత పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు గాసిప్స్ వచ్చిన సంగతి తెలిసిందే. జస్ట్ ప్రేమ వరకే కాదు.. ఆదిపురుష్ సినిమా రిలీజ్ అవ్వగానే ఇద్దరూ పెళ్లిపీటలెక్కనున్నట్లు కూడా హాట్ టాపిక్ నడిచింది. పైగా ప్రభాస్, కృతి అసలు అది నిజమో కాదో కూడా చెప్పకపోయే సరికి అంతా ప్రభాస్ పెళ్లి కృతితోనే ఫిక్స్ అయిపోయారు కూడా.
అదీకాకుండా కృతి.. తాను నటించిన భేడియా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పుడు, హీరో వరుణ్ ధావన్ ఈ రూమర్స్ నిజమేనని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేయడంతో టాప్ మీడియా వర్గాలు కూడా ప్రభాస్ పెళ్లి గురించి రాసేసాయి. ఇంతకీ వరుణ్ ఏమన్నాడంటే.. కృతి మోస్ట్ ఎలిజిబుల్ సింగిల్ ఉమెన్ కాదు. ఎందుకంటే కృతి మనసు మరొకరి దగ్గర ఉంది. అతను ప్రస్తుతం ముంబైలో లేడు. హైదరాబాద్‌లో దీపిక పదుకొణెతో షూటింగ్లో ఉన్నాడు అని అన్నాడు. దీని అర్థం కృతి మనసు ప్రభాస్ దగ్గర ఉందని ఇన్‌డైరెక్ట్‌గా అనేసాడు వరుణ్. అది నిజం కాదు అని కృతి చెప్పకుండా సిగ్గుపడటంతో ఇక ఆల్మోస్ట్ వీళ్ల పెళ్లి ఫిక్స్ అయిపోనట్లే అనుకున్నారు అంతా.
ఇక ఇలాగే ఊరుకుంటే లాభం లేదని కృతి వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. తన గురించి ప్రభాస్ గురించి వస్తున్న పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని వరుణ్ కామెడీ చేసాడని తెలిపింది. అయితే ఇదే విషయం గురించి తాజాగా కృతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. వరణ్ అలా అనేసరికి అప్పటికి ఏం చేయాలో తెలీక మౌనంగా ఉండిపోయాను కానీ చాలా బాధపడ్డానని తెలిపింది. వరుణ్ అలా చెప్పడం చాలా బాధ కలిగింది. ఎందుకంటే.. ప్రభాస్ నుంచి కాల్ వస్తే ఏం చెప్పాలా అని చాలా భయపడ్డాను. తర్వాత నేనే ప్రభాస్‌కు కాల్ చేసి వరుణ్ ఇలా అన్నాడు అని చెప్పాడు. అప్పుడు ప్రభాస్ వరుణ్ అలా ఎందుకు చెప్పాడు అని అడిగాడు. అప్పుడు నాకు తెలీదు వరుణ్ గురించి తెలిసిందేగా అని చెప్పాను. దాంతో ప్రభాస్ కూడా ఏమీ అనలేక లైట్ తీసుకున్నాడు. అని తెలిపింది కృతి. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమాను జూన్ 16న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.