Truecaller: ఇండియాపై కామెంట్ చేసిన యువతికి బిగ్ ఆఫర్
Hyderabad: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ యాప్లికేషన్ సంస్థ ట్రూ కాలర్.. (truecaller) ఇండియాపై కామెంట్ చేసిన యువతికి పెద్ద ఆఫర్ ఇచ్చింది. చదువు అయిపోగానే తమ కంపెనీలో ఉద్యోగం చేసుకోవచ్చని ట్రూ కాలర్ సంస్థ సీఈవో మమేదీ వెల్లడించారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఏక్తా (ekta) అనే యువతి కెనడాలో (canada) చదువుకుంటోంది. అయితే ఓ వ్యక్తి అక్కడి ఇండియన్స్‌ను ఎందుకు కెనడా వచ్చారు అని అడుగుతూ వీడియోలు చేస్తున్నాడు. ఆ సమయంలో ఏక్తా ఇచ్చిన సమాధానం ఎంతో మంది ఇండియన్స్‌కు ఒళ్లుమండేలా చేసింది. ఇంతకీ ఏక్తా ఏమని చెప్పిందంటే.. చిన్నప్పటి నుంచి ఇండియా వదిలి వేరే దేశానికి వెళ్లిపోవాలని కలలు కంటుండేదాన్ని. అందుకే కెనడా వచ్చాను అని చెప్పింది. మరి కెనడాలో ఏం నచ్చింది అని ఆ వ్యక్తి అడగ్గా.. ఇక్కడి బ్యూటిఫుల్ ప్రదేశాలు, సన్ రైజ్, సన్ సెట్ నచ్చాయి అని చెప్పింది.
దాంతో ఏక్తా వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అందరూ ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ నోటికొచ్చినట్లు తిడుతూ కామెంట్స్ పెట్టారు. ఏక్తా వీడియో చూసిన మమేదీ ఓ పోస్ట్ పెట్టారు. “” ఏక్తా.. నువ్వు నిజంగా చాలా కూల్ పర్సన్. పిచ్చోళ్ల కామెంట్స్ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ చదువు అయిపోయాక మా కంపెనీలో జాబ్ రెడీగా ఉంటుంది. కెనడా అనే కాదు. ఏ బ్రాంచ్‌లోనైనా నువ్వు హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు“ అని తెలిపారు.