Rahul Gandhi: ఇదే నాకు చివ‌రి అవ‌కాశం

Delhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) త‌న‌కు సూర‌త్ కోర్టు వేసిన శిక్ష‌ను ర‌ద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును (supreme court) ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతానికి సూర‌త్ కోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టును హోల్డ్‌లో పెట్టింది. మోదీ ఇంటిపేరుకు సంబంధించిన ప‌రువు నష్టం దావా కేసులో సూర‌త్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. దాంతో రాహుల్ ఈ కేసును ప‌రిశీలించి కొట్టివేయాల్సిందిగా సుప్రీంకోర్టును కోరారు.

ఈ నేప‌థ్యంలో ముగ్గురు జ‌డ్జిల స‌మ‌క్షంలో ఈ కేసుపై సుప్రీంకోర్టులో వాద‌న‌లు జ‌రుగుతున్నాయి. రాహుల్ త‌ర‌ఫు న్యాయ‌వాది అభిషేక్ మ‌ను సింఘ్ని  (abhishek manu singhvi) వాదన‌లు వినిపించారు. రాహుల్‌పై కేసును కొట్టివేయ‌డానికి ఆయ‌న‌కు ఇదే చివ‌రి అవ‌కాశం అని కోర్టుకు తెలిపారు. మోదీ ఇంటి పేరు ఉన్న‌వారంతా దొంగ‌లే అని రాహుల్ అన్న‌ప్పుడు ఈ కేసులో13 కోట్ల మంది మోదీ పేరున్న‌ ప్ర‌జ‌ల‌ను ఎలా చేరుస్తార‌ని ప్ర‌శ్నించారు.

రాహుల్‌పై మొద‌ట కేసు వేసిన గుజ‌రాత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ (purnesh modi) అస‌లు పేరు మోదీ కానేకాద‌ని, ఎమ్మెల్యే అవ్వ‌డానికి ముందు ఆయ‌న మోదీ పేరును త‌గిలించుకున్నార‌ని తెలిపారు. అలాంట‌ప్పుడు అత‌ను రాహుల్‌పై వేసిన కేసు చెల్ల‌దని, పూర్ణేశ్ కాకుండా మోదీ పేరున్న మ‌రో వ్య‌క్తి ఎవ్వ‌రూ కూడా రాహుల్‌పై కేసు పెట్ట‌లేద‌ని వాద‌న‌లు వినిపించారు.

“” విచిత్రం ఏంటంటే.. మోదీ పేరున్న‌వారు 13 కోట్ల మంది. వారిలో కేవ‌లం BJPకి చెందిన‌వారే రాహుల్‌పై కేసులు ఎలా పెడ‌తారు? రాహుల్‌పై మొత్తం 13 క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయ‌ని ఆరోపించారు. వాటిలో ఒక్క‌టి కూడా సాక్ష్యాల‌తో రుజువు చేయ‌లేక‌పోయారు. రెండేళ్లు జైలు శిక్ష విధించ‌డానికి ఇదేమీ మ‌ర్డ‌ర్, రేప్, కిడ్నాప్ కేసు కాదు క‌దా. ఇలాంటి వ్యాఖ్య‌ల‌పై రెండేళ్లు జైలు శిక్ష విధించిన దాఖ‌లాలు గ‌తంలో లేనేలేవు “” అని సింఘ్వి త‌న వాద‌న‌లు వినిపించారు. మ‌రి సుప్రీంకోర్టు ఏం నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి. వాదోప‌వాదాలు విన్నాక సుప్రీంకోర్టు సూర‌త్ కోర్టు తీర్పును హోల్డ్‌లో పెట్టింది.