Murder: ల‌వర్‌తో దొరికిపోయిన భార్య‌

Madhya Pradesh: ఇంట్లో క‌ట్టుకున్న భ‌ర్త ఉండ‌గా ప‌రాయి వ్య‌క్తితో అఫైర్ పెట్టుకున్న ఓ మ‌హిళ అడ్డంగా త‌న భ‌ర్త‌కు దొరికేసింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో (madhya pradesh) చోటుచేసుకుంది. దాంతో భ‌ర్త‌కు ఒళ్లుమండిపోయి న‌డిరోడ్డు మీదే న‌రికేసాడు (murder). గ్వాలియ‌ర్ జిల్లాకు చెందిన మురాయ్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. అయితే భార్య వేరొక‌రితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. ప‌ని మీద బ‌య‌ట‌కు వెళ్లిన మురాయ్‌కి త‌న భార్య మ‌రో వ్య‌క్తితో అడ్డంగా దొరికిపోయింది. దాంతో కోపంతో ఊగిపోయిన మురాయ్ కొడ‌వ‌లిలో ఇద్ద‌రినీ అక్క‌డిక‌క్క‌డే న‌రికేసి పారిపోయాడు. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. మురాయ్ కోసం పోలీసులు గాలింపు చేప‌డుతున్నారు.