Top Releases: వ‌స్తున్నాం.. కొడుతున్నాం..!

Hyderabad: 2023-2024లో బాక్సాఫీస్ బ‌ద్ద‌లుకొట్ట‌డానికి టాలీవుడ్ బ‌డా హీరోలు సిద్ధ‌మ‌వుతున్నారు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 10 పెద్ద‌ సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయి. ఆ సినిమాలేంటో.. ఎవ‌రెవరు బ‌రిలో దిగ‌నున్నారో చూద్దాం. (top releases)

భోళా శంక‌ర్ (bhola shankar)
మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) న‌టించిన సినిమా ఇది. మెహ‌ర్ ర‌మేష్ (meher ramesh) డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 11న రిలీజ్ అవ‌బోతోంది. త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన వేదాళంకు ఈ సినిమా రీమేక్‌గా రానుంది. త‌మ‌న్నా హీరోయిన్‌గా, కీర్తి సురేష్ చిరు చెల్లిగా న‌టించారు. అక్కినేని సుశాంత్ కీ రోల్ ప్లే చేసారు.

స‌లార్ (salaar)
ఆదిపురుష్ సినిమాతో ఎంతో హ‌ర్ట్ అయిన ప్ర‌భాస్ (prabhas) ఫ్యాన్స్ త్వ‌ర‌లో ఫుల్ మీల్స్ తిన‌బోతున్నారు. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో ప్ర‌భాస్ న‌టిస్తున్న స‌లార్ సినిమా సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ అవ‌బోతోంది. ఇందులో శృతి హాస‌న్ (shruti haasan) హీరోయిన్‌గా న‌టించింది.

భ‌గ‌వంత్ కేస‌రి (bhagavanth kesari)
బాల‌కృష్ణ (balakrishna) ఈసారి భ‌గ‌వంత్ కేస‌రిగా రాబోతున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్, శ్రీలీల హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ చేసారు. అక్టోబ‌ర్ 19న సినిమా రిలీజ్ అవబోతోంది.

ఓజీ (og)
దాదాపు ఆరేళ్ల త‌ర్వాత రీమేక్ కాకుండా ఒరిజిన‌ల్ స్క్రిప్ట్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) ఆడియ‌న్స్ ముందుకు రాబోతున్నారు. సుజీత్ (sujeeth) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మాగ్జిమం డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. (top releases)

సైంధ‌వ్ (saindhav)
రానా నాయుడు సిరీస్‌లో యాక్ట్ చేసి ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్‌ను పోగొట్టుకున్నారు విక్ట‌రీ వెంక‌టేష్‌ (venkatesh). ఈసారి సైంధ‌వ్ సినిమాతో ఆడియ‌న్స్ ముందుకు రాబోతున్నారు. గెస్ట్ రోల్స్‌లో న‌టిస్తూ వ‌స్తున్న వెంకీ మామ ఇప్పుడు సైంధ‌వ్‌గా డిసెంబ‌ర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

గుంటూరు కారం (guntur kaaram)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu)త్రివిక్ర‌మ్ (trivikram) కాంబినేష‌న్‌లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ‌బోతోంది. ఎన్నో వాయిదాలు.. ఎన్నో మార్పుల త‌ర్వాత చివ‌రికి ఈ సినిమా ఓ ట్రాక్‌లో ప‌డింది. మీనాక్షి చౌద‌రి, శ్రీలీల హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. (top releases)

దేవ‌ర‌ (devara)
యంగ్ టైగ‌ర్ NTR కొరటాల శివ కాంబినేషన్‌లో వ‌స్తున్న దేవ‌ర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అవ‌బోతోంది. జాన్వి క‌పూర్ (janhvi kapoor) ఇందులో హీరోయిన్‌గా, సైఫ్ అలీ ఖాన్ విల‌న్‌గా యాక్ట్ చేస్తున్నారు.

పుష్ప 2 (pushpa 2)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) న‌టిస్తున్న పుష్ప‌: ది రూల్ (pushpa: the rule) సినిమా 2024లో జూన్ నెల త‌ర్వాత ఎప్పుడైనా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

గేమ్ ఛేంజ‌ర్ (game changer)
మెగా ప‌వ‌ర‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ (am charan) యాక్ట్ చేస్తున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమా కూడా 2024 జూన్ త‌ర్వాత ఎప్పుడైనా రిలీజ్ అవ్వ‌చ్చు. శంక‌ర్ డైరెక్ష‌న్ సినిమా అంటే రిలీజ్ డేట్ వెంట‌నే అనౌన్స్ చేయడం కాస్త క‌ష్ట‌మే. (top releases)