BRO Issue: ఓ పవన్ కళ్యాణ్ మేనల్లుడా!
AP: బ్రో సినిమా (bro issue) వివాదం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఏపీ మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) ఓ పట్టాన ఈ విషయాన్ని వదిలేలా లేరు. సినిమాని సినిమాగా చూడండి.. అనవసరంగా రాజకీయం చేయొద్దు అని సాయి ధరమ్ తేజ్ (sai dharam tej) చెప్పిన మాటకు అంబటి రాంబాబు మరో కౌంటర్ వేసారు. “” ఓ పవన్ కళ్యాణ్ మేనల్లుడా! మీరు సినిమాని సినిమాగా తియ్యండయ్యా! అందులో మా గోకుడు ఎందుకు? మీరు సినిమాని సినిమాగా తీస్తే మేము సినిమాని సినిమాగానే చూస్తాం “” అని కామెంట్ చేసారు.
ఈ విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకుని అంబటి రాంబాబు (ambati rambabu) ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారో ఆయనకే తెలియాలి. ఏపీలో పట్టించుకోవాల్సిన ఎన్నో అంశాలను వదిలేసి ఆయన బ్రో సినిమాపై పడ్డారు. ఎన్ని కలెక్షన్లు వచ్చాయి, పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత, చిన్న సినిమాలు ఎలా బతకాలి అంటూ దీనిని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. దీనిపై అంబటి రాంబాబు ఎంత స్పందిస్తే అంతగా ఆయనకే ఎఫెక్ట్ పడుతుందన్న విషయం మర్చిపోతున్నారు. ఇప్పటికే ఓ ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రెస్మీట్లు పెట్టి సినిమా కలెక్షన్ల గురించి చెప్పడం ఏంటి అని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (bro issue)