NBK 108: బాలయ్య కూతురిగా క్రేజీ హీరోయిన్​!

‘వీరసింహా రెడ్డి’తో ఈ సంవత్సరానికి గ్రాండ్​ వెల్​కమ్​ చెప్పిన బాలకృష్ణ అదే స్పీడుతో వరుస సినిమాలు చేసేస్తున్నారు. సినిమాలతోపాటు అన్​స్టాపబుల్​ టాక్​ షోతోనూ అభిమానులను అలరిస్తున్నారు. ఇక వెబ్​సిరీస్​లోనూ బాలయ్య నటించబోతున్నారనే వార్త వినిపిస్తోంది. అయితే తాజాగా NBK108 సినిమాలో బాలయ్య కూతురిగా నటించబోయేది ఎవరనే క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్​. సక్సెస్​ఫుల్​ డైరెక్టర్​ అనిల్​ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటించనుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ NBK108. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న నటి శ్రీలీల ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయింది. ఈ సందర్భంగా శ్రీలీల, బాలకృష్ణ చేయి పట్టుకున్నట్లుగా వున్న బ్యూటీఫుల్ స్టిల్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో తన మార్కు కామెడీ కంటే, బాలయ్య తరహా యాక్షన్ ఎక్కువగా ఉంటుందని ఇంతకు ముందే చెప్పేశారు డైరెక్టర్​ అనిల్ రావిపూడి.

బాలకృష్ణ 108వ సినిమా ప్రస్తుత్తం సెట్స్ పై ఉంది. ఇందులో తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయనీ, బాలయ్యకి కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుందని అనిల్ రావిపూడి అన్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన కథానాయికగా ఎవరు నటిస్తారనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ‘అఖండ’ .. ‘వీరసింహా రెడ్డి’ సినిమాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తమన్ నిలబెట్టిన కారణంగా, సహాజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.
‘ధమాకా’ సినిమాతో మంచి గుర్తింపు పొందిన శ్రీలీల వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఈ కన్నడ భామ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తర్వాతి సినిమాలోనూ హీరోయిన్​గా ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న వినోదయా సీతంలోనూ ఓ ప్రత్యేక పాట చేయనుంది శ్రీలీల. ఇక త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీలో కూడా శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.