Gomatha: గోదానము ఎలా చేయాలి?
Hyderabad: ఆవు మనకు దైవంతో సమానం (gomatha). అందుకే చాలా మంది అవులను ఇంటి ముందు నుంచి తీసుకెళ్తున్నప్పుడు వారిని ఆపి మరీ మనకి తోచించి సమర్పించుకుంటాం. అయితే అసలు గోదానము ఎలా చేయాలి? ఏ విధంగా చేస్తే ఫలితం ఉంటుంది? (godanam)
గోదానము చేసే ముందు గోవత్సము అంటే గోవు పాలు తాగాలి. ఆ తర్వాతే గోదానము చేయాలి. దానం చేస్తున్నప్పుడు గోమాతను ఎలా పడితే అలా పిలవకూడదు. కొందరు విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఆవులను పిలుస్తుంటారు. అలా కాకుండా శారద, లక్ష్మి పేర్లతో పిలవాలి. గోమాత తోక చివరి భాగము నుంచి నీరు వదిలి దానం చేయాలట. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా గోదానము చేయవచ్చు. (gomatha) గోదానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి. అప్పుల సమస్యలు ఉంటే తొలగిపోతాయట. మరణం తర్వాత మోక్షం కూడా లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి.
గోదానం.. దీనికి అర్థమేంటి?
గో అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. ఈ పదానికి వివిధ అర్థాలు ఉన్నాయి. ఆహారం, జీవనం, స్పర్శ వంటి అర్థాలు వస్తాయి. ఇక దానం అంటే అందరికీ తెలిసిందే. గోదానం అంటే గోమాతను (gomatha) కానుకగా ఇవ్వడం. పాలిచ్చే ఆవును దూడతో పాటు బ్రాహ్మణుడికి దానం చేస్తే వేల జన్మాల పుణ్యం వస్తుందని నమ్ముతారు.