YS Sharmila: 41 మంది చనిపోతే మీకు సంతోషమా?
Hyderabad: వరదల్లో 41 మంది చనిపోతే అది మీకు సంతోషమా అంటూ bRS మంత్రి KTRను ప్రశ్నించారు YSRTపార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ (ys sharmila). వరద బాధితులకు సాయం అందక చస్తుంటే KCR చారిత్రక నిర్ణయాలపై సంబురాలు చేసుకోవాల్నా చిన్న దొర అంటూ మండిపడ్డారు. వర్షాలకు ఇళ్లు కూలి, వరదల్లో కొట్టుకుపోయి 41 మంది ప్రాణాలు పోతే మీకు సంతోషమా అని ప్రశ్నించారు.
“” 10 వేల ఎకరాల్లో పంటలు మునిగి అన్నదాత కన్నీరు పెడుతుంటే మీకు సంబరమా? రైతన్నలకు రూ.2 వేల కోట్ల నష్టం జరిగితే మీకు సంబరమా? చారిత్రక నిర్ణయాలు అంటే ఏంటి? మీ అయ్య రుణమాఫీ చేయకపోవడమా? నిరుద్యోగ భృతి ఎగ్గొట్టడమా? డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకపోవడమా? ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోవడమా? క్వశ్చన్ పేపర్లు అమ్ముకోవడమా? 104 సేవలను ఎత్తేయడమా? రూ.4 లక్షల కోట్లు పంది కొక్కుల్లా పీక్కుతినడమా? సిగ్గు లేకుండా వరద బాధితులకు రూ.10 వేలు ఎగ్గొట్టిన చరిత్ర KCRది. పంట పరిహారం ఇవ్వకుండా, పంట బీమా ఇవ్వకుండా నిండా ముంచిన హిస్టరీ KCRది. పోడు పట్టాల పేరుతో, బీసీ బంధు, మైనార్టీ బంధు పేరుతో దగా చేసిన చరిత్ర కేసీఆర్ ది. కరెంట్ నుంచి రిజిస్ట్రేషన్ల వరకు రేట్లు పెంచి, ప్రజల రక్తం తాగిన చరిత్ర KCRది. వీధికో బెల్టు షాపు పెట్టి, మహిళల మంగళ సూత్రాలు తెంపిన చరిత్ర KCRది. మీ దిక్కుమాలిన నిర్ణయాలకు, దగాకోరు పాలనకు, మోసపూరిత హామీలకు KCRకు చేయాల్సింది సంబురాలు కాదు బడితపూజ. సంబరాలు చేసుకుంటుంది తెలంగాణ ప్రజలు కాదు KCR కుటుంబం మాత్రమే “” అంటూ మండిపడ్డారు షర్మిళ. (ys sharmila)