Shabana Azmi: ఈ వయసులో అవేం మాటలు?
Mumbai: వయసుతో సంబంధం లేకుండా లిప్ కిస్ సీన్లు పెట్టేస్తున్నారు డైరెక్టర్లు. టాలీవుడ్లో మళ్లీ పెళ్లి (malli pelli) సినిమాలో వీకే నరేష్ (vk naresh), పవిత్ర లోకేష్ (pavitra lokesh) లిప్ కిస్ సీన్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు బాలీవుడ్లో షబానా అజ్మి (shabana azmi), ధర్మేంద్రల (dharmendra) లిప్ కిస్ సీన్ హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ రీసెంట్గా రిలీజ్ అయిన రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ (rocky aur rani ki prem kahani) సినిమాలో కపుల్‌గా నటించారు. అసలైతే ఇందులో రణ్వీర్ సింగ్ (ranveer singh), ఆలియా భట్ (alia bhatt) జంటగా నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందో ఏమో కానీ ధర్మేంద్ర, షబానా అజ్మీల మధ్య రొమాంటిక్ సీన్లు బాగానే ఉన్నాయి.
దీని గురించి షబానా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “” మేమిద్దరం కిస్ చేసుకున్న సీన్‌పై ఇంత రచ్చ ఎందుకు. నేనైతే నా భర్త జావేద్ అక్తర్‌తో కలిసి సినిమా చూసాను. ఆయన ఏమీ అనుకోలేదు. అయినా ధర్మేంద్రలాంటి హ్యాండ్సమ్కి లిప్ కిస్ ఇవ్వమంటే ఎవరు మాత్రం కాదంటారు “” అంటూ వయసుకి సంబంధం లేని మాటలు మాట్లాడి హాట్ టాపిక్‌గా మారారు షబానా.