Brain: మహిళ మెదడులో మార్బుల్స్!
Bengaluru: బెంగళూరులో (bengaluru) విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ బుర్రలో ఏకంగా మార్బుల్స్ (brain) పెరుగుతున్నాయట. 52 ఏళ్ల ఆ మహిళకు ఈ సమస్య చిన్నప్పటి నుంచి ఉన్నప్పటికీ డాక్టర్లను సంప్రదించలేదట. దాంతో రాను రాను తన తలపై వచ్చిన చిన్న కురుపు కాస్తా 6 అంగుళాల పొడవు పెరిగింది. ఇక నొప్పి తట్టుకోలేక ఆమె వైద్యల దగ్గరికి వెళ్లింది. అది చూసి వాళ్లు ట్యూమర్ అనుకున్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ తీసి చూస్తే చిన్న చిన్న రాళ్లు ఏర్పడటం చూసి షాకయ్యారు. ప్రస్తుతానికి అయితే ఆపరేషన్ చేసి దానిని తొలగించేసారు. ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.