Ustaad Bhagat Singh: ప‌వ‌న్ కండీష‌న్

Hyderabad: హ‌రీష్ శంక‌ర్ (harish shankar) ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ (ustaad bhagat singh). ఆల్రెడీ ఫ‌స్ట్ లుక్, టీజర్‌కు మంచి హైప్, టాక్ వ‌చ్చేసింది. కాక‌పోతే ప‌వ‌న్ పొలిటిక‌ల్ ప‌నుల‌తో బిజీగా ఉండ‌టంతో సినిమా షూటింగ్ అయిపోయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ అలాంటిదేమీ లేద‌ట‌. ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్స్ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్నాయ‌ని టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. సినిమాను 2024 ఎన్నిక‌లకు ముందే రిలీజ్ అవ్వాల‌ని హ‌రీష్ శంక‌ర్‌కు ప‌వ‌న్ కండీష‌న్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. దానికి త‌గ్గ‌ట్టు హ‌రీష్ శంక‌ర్ చ‌క‌చ‌కా ప‌నులు చేసేస్తున్నారు. ఇందులో శ్రీలీల (sreeleela) హీరోయిన్‌గా న‌టిస్తోంది.