Chandrababu Naidu: రోడ్ షోలో అగ్ని ప్రమాదం

AP: TDP అధినేత‌ చంద్రబాబు నాయుడు (chandrababu naidu) రోడ్ షోలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆయ‌న ప్రసంగిస్తున్న ప్రాంతానికి చేరువలో ఉన్న టిఫిన్ బండికి నిప్పు అంటుకుంది. అయినా కూడా ఆయ‌న ప్రసంగాన్ని కొన‌సాగించారు. సాగునీటి సంద‌ర్శ‌న‌లో భాగంగా వైఎస్సార్ జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌టిస్తున్నారు. జమ్మ‌ల‌మ‌డుగు స‌ర్కిల్‌లో నిర్వ‌హించిన రోడ్‌షోలో ఆయ‌న ప్ర‌సంగం చేస్తుండ‌గా ఉన్న‌ట్టుండి టిఫిన్ బండి నుంచి మంట‌లు చెల‌రేగాయి.