Nitin Desai: ఆత్మ‌హ‌త్య చేసుకున్న ల‌గాన్ ద‌ర్శ‌కుడు

Mumbai: ప్ర‌ముఖ బాలీవుడ్ దర్శ‌కుడు నితిన్ దేశాయ్ (nitin desai) ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ల‌గాన్, జోదా అక్బ‌ర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు తీసిన ఆయ‌న ఇలాంటి విప‌రీత చ‌ర్య‌కు పాల్ప‌డ‌టంతో బాలీవుడ్ ఇండ‌స్ట్రీ శోక‌సంద్రంలో మునిగిపోయింది. క‌ర్జాత్ ప్రాంతంలోని ND స్టూడియోలో మంగ‌ళ‌వారం రాత్రి ఆయ‌న ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. జాతీయ అవార్డు అందుకున్న ఆయ‌న ఈ అఘాయిత్యానికి ఎందుకు పాల్ప‌డ్డార‌న్న‌ది తెలియాల్సి ఉంది. (nitin desai)