Janasena: ఎన్నిక‌ల్లో గెలుపు త‌థ్యం..!

AP: తెనాలిలో జనసేన (janasena) జెండా ఎగురుతుందని ధీమా వ్య‌క్తం చేసారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan). 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన గెలుస్తుందని అన్నారు. నాదెండ్ల‌ మనోహర్ చిత్తశుద్ధి, నిబద్ధతను తెనాలి ప్రజలు ఎన్నటికీ మరచిపోరని, ఆయన నాయకత్వ లక్షణాలు… నియోజకవర్గ అభివృద్ధి కోసం తపించే విధానం ప్రజలకు అవసరమ‌ని తెలిపారు. YSRCP నాయకుడికి దోపిడీ అనేది పుట్టుకతో వచ్చిన బుద్ధని, రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన (janasena) నిబద్ధతతో నిలబడి ఉందని అన్నారు. కచ్చితంగా సుస్థిర ఆంధ్రప్రదేశ్ సాధించి తీరుతామ‌ని తెనాలి నియోజకవర్గ నాయకులతో ఆత్మీయ సమావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) తెలిపారు.