Work From Scooty: ఉద్యోగి కష్టాలు..!
Hyderabad: వర్క్ ఫ్రమ్ హోం, వర్క్ ఫ్రం ఆఫీస్ గురించి విన్నాం కానీ.. ఈ వర్క్ ఫ్రం స్కూటీ ఏంటీ (work from scooty) అనుకుంటున్నారా? ఓ వ్యక్తి ఆఫీస్ లాగిన్ టైం అయిపోవడంతో తన స్కూటీలో కాళ్ల దగ్గర ఉన్న స్పేస్‌లో ల్యాప్‌టాప్ పెట్టుకుని వర్క్ చేస్తున్న దృశ్యం హైదరాబాద్‌లో కనిపించింది. అతను ల్యాప్‌టాప్ అలా పెట్టుకుని వెళ్తుంటే తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.