Yuvagalam: జ‌న‌స‌మీక‌ర‌ణ‌కు కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారా?

AP: TDP జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నారా లోకేష్ (nara lokesh) యువ‌గ‌ళం (yuvagalam) పాద‌యాత్ర‌తో బిజీ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న పాద‌యాత్ర ద‌ర్శికి చేరుకుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న పాద‌యాత్ర గురించి సోష‌ల్ మీడియాలో అప్‌డేట్లు ఇస్తునే ఉన్నారు లోకేష్‌. లోకేష్ ఏ ప్రాంతానికి వెళ్లి స‌భ నిర్వ‌హిస్తుంటే అక్క‌డికి జ‌నాలు గుమిగూడుతున్నారు. వేలల్లో త‌ర‌లి వ‌స్తున్నారు. అధికారంలో లేని పార్టీ నుంచి ఒకరు పాద‌యాత్ర చేస్తున్నారంటే వారి కోసం జ‌నాలు ఎందుకు ఎగ‌బ‌డ‌తారు? ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో ప్ర‌చారం చేస్తున్నప్పుడు మాత్ర‌మే ఇంత మంచి జ‌నాలు స‌భ‌ల‌కు హాజ‌రు అవుతుంటారు. కానీ పాద‌యాత్ర స‌మ‌యంలో ఏర్పాటుచేస్తున్న స‌భ‌ల‌కు కూడా ఎలా వ‌స్తున్న‌ట్లు?

కొన్ని గ్రౌండ్ రిపోర్టుల ప్ర‌కారం.. స‌భ‌కు జ‌నాన్ని స‌మీక‌రించ‌డానికి TDP దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేస్తోంద‌ట‌. డ‌బ్బు ఇస్తుంటేనే జ‌నాలు స‌భ‌ల‌కు హాజ‌రు అవుతున్నార‌ని టాక్. ఇంకొంద‌రైతే డ‌బ్బులు తీసుకుని కూడా రావ‌డం లేద‌ట‌. అయితే ఇలా అన్ని స‌భ‌ల్లోనూ జ‌రుగుతోంద‌ని కాదు. కొన్ని స‌భ‌ల‌కు మాత్ర‌మే ఇలా ఖ‌ర్చు పెట్టి మ‌రీ జనాన్ని పిలుచుకొస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మ‌రోపక్క జ‌న‌సేనాని ప‌వన్ క‌ళ్యాణ్ (pawan kalyan) వారాహి యాత్ర‌తో బిజీగా ఉన్నారు.

ఆయ‌న సినిమా యాక్ట‌ర్ కాబ‌ట్టి ఆయ‌న‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు కాబ‌ట్టి ప‌వ‌న్‌కు డబ్బు ఖర్చు పెట్టి మ‌రీ జ‌నాన్ని పోగేయాల్సిన అవ‌స‌రం లేదు. లోకేష్ కాళ్లు అరిగేలా తిరుగుతున్న‌ప్ప‌టికీ వారాహికి వ‌స్తున్నంత పాపులారిటీ ఆయ‌కు రావ‌డంలేదు. పైగా ఇప్పుడు లోకేష్ మాట్లాడే తీరు కూడా మార్చేసారు. కొన్ని ప‌దాల‌ను నొక్కి ప‌ట్టి మ‌రీ చెప్తూ త‌న స్పీచ్ స్టైల్ మార్చారు. కొంద‌రు ఈ విష‌యంలోనూ ట్రోల్స్ చేస్తున్నారు. (yuvagalam)

ఎలాగైనా ప్రస్తుతం ఉన్న YSRCP ప్ర‌భుత్వాన్ని ప‌క్క‌కు నెట్టేసి మళ్లీ అధికారం చేజిక్కించుకోవాల‌ని చూస్తోంది TDP. అందుకే పాద‌యాత్ర‌కు జ‌నాన్ని పోగేయ‌డానికి ఎంత ఖ‌ర్చు అయినా భ‌రిస్తోంది. ఇంకొన్ని రోజుల్లో లోకేష్ పాద‌యాత్ర ముగియ‌నుంది. అన్ని నియోజ‌క‌వర్గాల్లోని ప్ర‌జ‌లు, ముఖ్యంగా యువ‌త స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని దానికి త‌గ్గ‌ట్టు మేనిఫెస్టోను ప్ర‌క‌టిస్తామ‌ని లోకేష్ ఓ సంద‌ర్భంలో అన్నారు. (yuvagalam)