Jaipur Express: మతం గురించి గొడవ.. ఆపై కాల్పులు
Mumbai: జైపూర్ ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో (jaipur express) ఓ పోలీస్ ఆఫీసర్ కాల్పులు జరిపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 12 రౌండ్ల కాల్పుల్లో ఒక పోలీస్, ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. చేతన్ కుమార్ అనే వ్యక్తి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నిందితుడు చేతన్ కుమార్ అసలు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో తెలిసింది. మతాల గురించి జరిగిన చర్చ అది కాస్తా ఈ కాల్పులకు దారితీసిందట. మృతుల్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులు ముస్లింలు.
చేతన్‌తో పాటు టీకారామ్ అనే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, మరో ఇద్దరు కానిస్టేబుల్స్ డ్యూటీలో ఉన్నారు. ఈ టీంలో చేతన్ కుమార్ సెక్యూరిటీగా ఉన్నాడు. రైలు సూరత్‌కు చేరుకున్నాక కాసేపు రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత పాల్ఘర్ స్టేషన్ దాటగానే చేతన్ కాల్పులు జరిపాడు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏకే-47తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మొత్తం 12 రౌండ్ల కాల్పులు జరిపాడు. (jaipur express)
కాల్పులు జరిపిన తర్వాత ముస్లింల గురించి విద్వేషపూరితమైన ప్రసంగం ఇచ్చి మరీ పారిపోయేందుకు చేతన్ యత్నించాడు. కానీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల సెలవు నుంచి వచ్చి డ్యూటీలో చేరిన చేతన్‌కు ముందు నుంచీ షార్ట్ టెంపర్ (కోపం) సమస్య ఉందని పై అధికారులు చెప్తున్నారు.