Anju: పాక్ వెళ్లిన హిందూ మహిళపై అనుమానాలు
Hyderabad: కట్టుకున్న భర్తను, పిల్లల్ని వదిలేసి వేరొకరితో ఎఫైర్ పెట్టుకుని పాకిస్థాన్ వెళ్లిపోయింది అంజు (anju). ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన అంజు పెళ్లయ్యాక రాజస్థాన్‌లో స్థిరపడింది. ఈమెకు ఇద్దరు పిల్లలు. కొన్ని రోజుల క్రితం జైపూర్ వెళ్తున్నానని భర్తతో చెప్పి అన్ని డాక్యుమెంట్లు రెడీ చేసుకుని ఏకంగా పాకిస్థాన్ వెళ్లిపోయింది. ఆమెకు పాక్‌కి చెందిన నస్రుల్లా అనే వ్యక్తి ఫేస్బుక్లో పరిచయం అయ్యాడట. అతనితో ప్రేమలో పడిన అంజు బోర్డర్ దాటి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లాక మతం మార్చుకుని తన పేరును ఫాతిమా అని మార్చుకుని నస్రుల్లాను పెళ్లి చేసుకుంది. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. (pakistan facebook love)
కానీ అంజు (anju) మతం మార్చుకున్నాక పాక్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త ఆమెకు స్థలం, నగదు గిఫ్ట్‌గా ఇచ్చాడట. మతం మార్చుకుంటే సంబంధం లేని మహిళకు అంత విలువైన కానుకలు ఇవ్వడంపై కేంద్ర మంత్రి నరోత్తమ్ మిశ్రా (narottam mishra) అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంజు పాక్‌కి వెళ్లడంలో ఏదో కుట్ర ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. వాఘా బోర్డర్ వద్ద చెకింగ్ మరింత స్ట్రిక్ట్ చేయాలని సూచించారు.
“” ఒకవేళ నిజంగానే పాక్ వ్యక్తితో ప్రేమలో పడి ఉంటే భర్తకు విడాకులు ఇచ్చేసి వెళ్లిపోవచ్చు. అలా కాకుండా భర్తకు, తల్లిదండ్రులకు చెప్పకుండా, పిల్లల్ని వదిలేసి మరీ అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉండేలా చూసుకుని మరీ వెళ్లిపోయిందంటే ఇదేదో అనుమానించాల్సిన విషయమే “” అని నరోత్తమ్ అన్నారు.