Manchu Manoj: TDPలోకి మంచు వార‌సుడు?

Hyderabad: మంచు మ‌నోజ్ (manchu manoj) తెలుగు దేశం పార్టీలో (tdp) చేర‌నున్నారా? అవున‌నే అంటున్నాయి విశ్వ‌సనీయ వ‌ర్గాలు. కొన్ని రోజులుగా ఆయ‌న TDPలో చేరాల‌ని ఆలోచ‌నలో ఉన్నార‌ని దీని గురించే త‌న తండ్రి మోహ‌న్ బాబుతో (mohan babu)కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని తెలుస్తోంది. మ‌నోజ్ భార్య భూమా మౌనిక రెడ్డి (bhuma mounika reddy) కుటుంబం కూడా ఎప్ప‌టినుంచో TDPలోనే ఉన్నారు. ఆమె అక్క భూమా అఖిల‌ప్రియ‌ (bhuma akhila priya), త‌ల్లిదండ్రులు TDP నేత‌లుగా వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు మ‌నోజ్ కూడా అదే పార్టీలో చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. (manchu manoj) ఈరోజు సాయంత్రం TDP అధినేత‌ చంద్రబాబు నాయుడుతో (chandrababu naidu) మంచు మనోజ్ భేటీకానున్నారు. కొన్ని రోజుల్లో అధికారిక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశాలు ఉన్నాయి.