NDA: నితీష్.. నువ్వు మావోనివే..!
Delhi: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (nitish kumar) ఎప్పటికైనా తమతోనే (nda) కలుస్తారని అంటున్నారు కేంద్ర మంత్రి రామ్‌దాస్ అతావలే (ramdas athawale). రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా BJPని ఓడించాలని నితీష్ ప్లాన్ వేసి కాంగ్రెస్‌తో (congress) చేతులు కలిపి అపోషినన్ కూటమిని (I-N-D-I-A) ఏర్పాటుచేసారు. అయితే దీనికి ఇండియా అని పేరు పెట్టడం నితీష్‌కి ఏమాత్రం ఇష్టం లేదు. పైగా కి తనను కన్వీనర్‌ను చేయకుండా కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేను చేయడంపై ఆయన అలిగారు. దాంతో ఎప్పటికైనా నితీష్ NDAతోనే కలుస్తారని అన్నారు రామ్‌దాస్ అతావలే.
“” నితీష్ మావాడు. ఇప్పుడంటే ఏదో కోపంలో కాంగ్రెస్‌తో చేతులు కలిపారు కానీ ఎప్పటికైనా ఆయన NDAలోకే వస్తారు. ఎప్పుడు వచ్చినా స్వాగతిస్తాం. NDAలో నితీష్ లేని లోటు మాకు తెలుస్తూనే ఉంటుంది. నాకు నితీష్ మంచి ఫ్రెండ్. ఆయన మమ్మల్ని వదిలేసినా బిహార్‌కి కేంద్రం సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. బిహారీలు మా సొంత మనుషులు “” అని రామ్‌దాస్ మీడియా ద్వారా వెల్లడించారు.