Opposition In Manipur: మ‌ణిపూర్‌లో I-N-D-I-A

Manipur: మూడు నెల‌లుగా అట్టుడికిపోతున్న మ‌ణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించేందుకు వివిధ పార్టీల‌కు చెందిన 21 మంది స‌భ్యులు (opposition in manipur) బ‌య‌లుదేరారు. వీరంతా ఒకే ఫ్లైట్‌లో మ‌ణిపూర్ చేరుకున్నారు. అపోజిష‌న్ కూట‌మి I-N-D-I-A ఏర్ప‌డిన త‌ర్వాత తొలిసారి వీరు మ‌ణిపూర్ పర్య‌టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో BJP వారిపై కామెంట్స్ చేసింది. వారంతా మ‌ణిపూర్ ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చాక కొన్ని ప్ర‌శ్న‌లు అడ‌గాల‌ని నిర్ణ‌యించుకుంది. ఆ ప్రశ్న‌లు ఏంటంటే.. (opposition in manipur)

1. రాజ‌స్థాన్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోనూ మ‌హిళ‌ల‌పై ఎన్నో అఘాయిత్యాలు జ‌రుగుతున్నాయ్. మ‌రి ఆ రాష్ట్రాల్లో కూడా ప‌ర్య‌టిస్తారా?

2. మ‌ణిపూర్‌కి వెళ్లిన మంత్రుల్లో అధిర్ రంజ‌న్ చౌద‌రి ఒకరు. ఆయ‌న‌ది వెస్ట్ బెంగాల్. మ‌రి సొంత రాష్ట్రంలో జ‌రుగుతున్న నేరాల‌ను ఆయ‌న సపోర్ట్ చేస్తున్నారా?

3. మ‌ణిపూర్‌లో ప‌ర్య‌టించి రిపోర్ట్ స‌బ్మిట్ చేసిన‌ట్లుగానే.. ఈ 21 మంది ఎంపీలు రాజ‌స్థాన్, వెస్ట్ బెంగాల్‌లో జ‌రుగుతున్న నేరాల రిపోర్టుల‌ను కూడా స‌బ్మిట్ చేస్తారా?

అపోజిష‌న్ ఎందుకు మ‌ణిపూర్ వెళ్లింది?

అపోజిష‌న్ కూట‌మికి చెందిన 21 మంది ఎంపీలు మ‌ణిపూర్‌కి వెళ్లి స్వ‌యంగా అక్క‌డి స‌మ‌స్య‌లు తెలుసుకుని పార్ల‌మెంట్‌లో రిపోర్ట్ సబ్మిట్ చేయాల‌ని అనుకుంటున్నాయి. కుకి, మెతే అనే రెండు గిరిజ‌న వ‌ర్గాల‌కు చెందిన అల్ల‌ర్ల కార‌ణంగా మ‌ణిపూర్‌లో లా అండ్ ఆర్డ‌ర్ ప‌రిస్థితి కంట్రోల్లో లేదు. ఇంత జ‌రుగుతున్నా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి బిరేన్ సింగ్ రాజీనామా చేయ‌న‌ని అంటున్నారు.

అపోజిష‌న్ నేత‌లు రెండు రోజుల పాటు మణిపూర్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇటీవ‌ల ఇద్ద‌రు కుకి వ‌ర్గానికి చెందిన యువ‌తుల‌ను న‌గ్నంగా ఊరేగించి రేప్ చేసి చంపేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో ఆ తెగ‌కు సంబంధించిన లీడ‌ర్ల‌ను క‌ల‌వ‌నున్నారు. అల్ల‌ర్ల కార‌ణంగా తీవ్ర‌గాయాల‌పాలై చికిత్స పొందుతున్న‌వారిని క‌లిసి ప‌రామ‌ర్శించ‌నున్నారు. చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు ప్రగాఢ సానుభూతి తెల‌ప‌నున్నారు.

మ‌ణిపూర్‌కి స్వ‌యంగా వెళ్లి అక్క‌డి ప‌రిస్థితిని తెలుసుకుంటేనే ఏదైనా చేయ‌డానికి కుదురుతుంది. నిజాన్ని పార్ల‌మెంట్‌లోనే బ‌య‌ట‌పెడ‌తాం. మ‌ణిపూర్ ప‌రిస్థితిని కంట్రోల్ చేయ‌డంలో కేంద్రం ఫెయిల్ అయింది. మ‌ణిపూర్ ప్ర‌జ‌లు త‌మ ఘోష ఎవ‌రు వింటారా అని వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. వారి బాధ‌లు మేం స్వ‌యంగా విని తెలుసుకోవాల‌ని అనుకుంటున్నాం అని అపోజిష‌న్ ఎంపీలు తెలిపారు.