America వెళ్లిపోతా.. కంపెనీ ఓన‌ర్ ఆవేద‌న‌

Bengaluru: బెంగ‌ళూరులో రిజిస్ట్రేష‌న్ చేయించుకోవడంలో ఓ కంపెనీ (company) ఇబ్బందిప‌డుతోంది. దాంతో ఈ బెంగ‌ళూరులో (bengaluru) ఉండ‌టం కంటే అమెరికా (america) వెళ్లిపోవ‌డం న‌యం అని ఓన‌ర్లు భావిస్తున్నారు. బ్రిజ్ సింగ్ (brij singh) అనే వ్య‌క్తి బెంగ‌ళూరులో ఓ కంపెనీ పెట్టాల‌నుకున్నాడు. ఇందుకోసం రిజిస్ట్రేష‌న్ చేయించుకుందాం అంటే కుద‌ర‌డంలేద‌ట‌. రిజిస్ట్రేష‌న్ కోసం రెండు నెల‌లుగా క‌ష్ట‌ప‌డుతున్నా పూర్తి కావ‌డంలేద‌ని అంటున్నాడు. దాంతో బెంగ‌ళూరులో ఉండ‌టం కంటే అమెరికాకి వెళ్లిపోయి అక్క‌డ కంపెనీ పెట్టుకోవ‌డం బెట‌ర్ అనుకుంటున్నాడు.

“” నాకు ఇండియా అన్నా బెంగ‌ళూరు అన్నా ఇష్ట‌మే. కానీ సాన్ ఫ్రాన్‌సిస్కో లోని బే ఏరియాకి వ‌చ్చాక బెంగ‌ళూరు కంటే ఇక్క‌డే బాగుంది అనిపించింది. కంపెనీ రిజిస్ట్రేష‌న్‌కు రెండు నెల‌లుగా ప్ర‌య‌త్నిస్తున్నా అవ్వ‌డంలేదు. కస్ట‌మ‌ర్లు, ఇన్‌వెస్ట‌ర్లు, తోటి ఫౌండ‌ర్ల నుంచి వ‌చ్చిన ఫీడ్‌బ్యాక్ కూడా వేరే లెవ‌ల్‌లో ఉంది. బ‌హుశా నేను మ‌ళ్లీ అమెరికా వెళ్లిపోవాల‌నుకుంటా. ఇది నేను బాధాక‌ర‌మైన హృద‌యంతో చెప్తున్న మాట “”  అని ఓ పోస్ట్ పెట్టారు. 18 ఏళ్లుగా బ్రిజ్ సింగ్ ఫైనాన్స్, టెక్నాల‌జీ సెక్టార్ల‌కు సంబంధించి అమెరికా, ఇండియాలో ప‌నిచేస్తున్నాడు. అయితే ఇండియాలో కంపెనీ పెట్టాల‌నుకుంటున్న‌ప్పుడు ఇక్కడి రాష్ట్రాలు కూడా ఆ కంపెనీల‌ను స్వాగ‌తించ‌డానికి ఇంట్రెస్ట్ చూపించాలి అని తెలిపాడు.