Byjus: ఓ ఉద్యోగి కన్నీటిగాధ..!
Hyderabad: కోవిడ్ సమయంలో లాభాల్లో దూసుకెళ్లిన ఎడ్టెక్ కంపెనీ బైజూస్ (byjus). లాక్ డౌన్ కారణంగా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడిన బైజూస్ ఇప్పుడు ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. దివాలా అంచున ఉన్న బైజూస్ అప్పుల్లో కూరుకుపోయింది. దాంతో పలు ఆఫీస్ బిల్డింగ్‌లను ఖాళీ చేసేసింది. ఉద్యోగులను ఉన్నట్టుండి తీసేసింది. ఈ నేపథ్యంలో ఓ మహిళా ఉద్యోగి ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉన్నట్టుండి ఉద్యోగం (byjus) నుంచి తీసేయడమే కాకుండా జీతాలు కూడా ఇవ్వకుండా టార్చర్ పెడుతున్నారంటూ ఓ మహిళా ఉద్యోగి ఏడుస్తూ పెట్టిన వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తను ఎన్నో కష్టాల్లో ఉందని ఉద్యోగం నుంచి తీసేసినా పర్వాలేదు కానీ ఇలా జీతాలు ఇవ్వకపోతే ఎలా అంటూ వాపోయింది. ఈ విషయంలో ప్రభుత్వమే తనని ఆదుకోవాలని కోరింది. “” నా పేరు ఆకాంక్ష. ఎకాడెమిక్ స్పెషలిస్ట్‌గా బైజూస్‌లో ఏడాదిన్నర నుంచి పనిచేస్తున్నాను. మా ఇంట్లో సంపాదించేది నేనొక్కదాన్నే. ఇటీవల ఆమెను రిజైన్ చేయాలంటూ బలవంతం చేస్తున్నారు. కనీసం జీతం కూడా ఇవ్వలేదు. నాకు అప్పులు చాలా ఉన్నాయి. నా భర్తకు ఆరోగ్యం బాగోలేదు. నాకు జీతం ఇవ్వకపోతే నేను ఎలా బతకాలి? బైజూస్ చేస్తున్న అక్రమ పనులకు ఉద్యోగులు నలిగిపోతున్నారు. వారిని ప్రభుత్వమే కాపాడాలి “” అని లింక్డిన్లో బాధితురాలు వీడియో పోస్ట్ చేసింది.