DK Shivakumar: ఫండ్స్ లేవ్..!

Banglore: క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్.. (dk shivakumar) అభివృద్ధి ప‌నుల కోసం కేటాయించ‌డానికి ఫండ్స్ లేవ‌ని అంటున్నారు. ఈ మేరకు వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఎమ్మెల్యేల‌తో స‌మావేశం అయ్యారు. ఫండ్స్ కేటాయించ‌లేం అని చెప్ప‌డంతో అంతా షాక‌య్యారు. ప్ర‌స్తుతం త‌మ ముందు ఉన్న ముఖ్య‌మైన ప‌ని.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఐదు హామీల‌ను నిల‌బెట్టుకోవ‌డం మాత్ర‌మే అని చెప్పారు. ఆ హామీలు నెర‌వేర్చేవ‌ర‌కు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలకు ఫండ్స్ కేటాయించ‌డానికి లేద‌ని అన్నారు. గ‌త ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసింద‌ని, ఇప్పుడు చేతిలో ఉన్న ఫండ్స్ ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డానికే స‌రిపోతాయ‌ని చెప్పారు. అప్ప‌టివ‌ర‌కు ఎమ్మెల్యేలు కాస్త ఓపిక‌ప‌ట్టాలని రిక్వెస్ట్ చేసారు. (dk shivakumar)