Sai Baba: బాబా గురించి ఈ విషయాలు తెలుసా?
Hyderabad: బాబా అనగానే మనకు గుర్తొచ్చేది మహారాష్ట్రలోని పవిత్ర పుణ్యస్థలం షిర్డీ. షిర్డీలోని సాయి బాబా గురించి ఈ అద్భుతమైన విషయాలు తెలుసా? (sai baba)
రెండో రిచెస్ట్ టెంపుల్
షిర్డీ ప్రపంచంలోనే రెండో రిచెస్ట్ టెంపుల్. మొదటి స్థానంలో తిరుమల శ్రీవారి ఆలయం ఉంది.
అసలు పేరు ఎవ్వరికీ తెలీదు
సాయి బాబాను అందరూ సాయీ, బాబా అనే పిలుస్తారు తప్ప ఆయన అసలు పేరు ఏంటనేది ఎవరికీ తెలీదు. ఆయన అంటే గిట్టనివారు ఫకీర్ అని పిలిచేవారు. ఈ విషయం మనకు షిర్డీ సాయి మహత్యం సినిమా చూస్తే అర్థమవుతుంది. (sai baba)
చెవులకు గంధం
దాదాపు అందరు దేవతలు, దేవుళ్లకు చెవులు కుడతారట. కానీ బాబాకి మాత్రం ఏ ఆలయంలోనూ చెవులు కుట్టి ఉండవట. దాని బదులు ఆయన చెవులకు గంధం రాస్తారు. (sai baba)
పాదాలు మాత్రమే కనిపించాయి
ఓసారి శిర్డీ గ్రామంలో బాబా గురించి తెలుసుకుని ఎంతో మంది భక్తులుగా మారారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఎలాగైనా బాబా ఫొటో తీయాలని అనుకున్నారు. అందుకు బాబా ఒప్పులేదట. ఎంతో బతిమిలాడితే కేవలం పాదాల ఫొటోలను మాత్రమే తీసుకోమన్నారు. అయితే ఆ కెమెరా మ్యాన్ బాబాకు తెలీకుండా మొత్తం ఫొటోను తీయాలనుకున్నాడు. తీరా చూస్తే ఆ ఫొటోలో బాబా పాదాలు మాత్రమే వచ్చాయట.