Vivek Agnihotri: ప్ర‌భాస్ సినిమాతోనే నా పోటీ

Hyderabad: బాలీవుడ్ డైరెక్ట‌ర్ వివేక్ అగ్న‌హోత్ని (vivek agnihotri) ప్ర‌భాస్ (prabhas) సినిమాల‌తోనే పోటీ ప‌డాల‌ని అనుకుంటున్నారు. ఏడాది క్రితం ప్ర‌భాస్ న‌టించిన రాధే శ్యాం (radhe shyam) సినిమా స‌మ‌యంలో వివేక్ డైరెక్ట్ చేసిన ది క‌శ్మీర్ ఫైల్స్ (the kashmir files) సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. కానీ రాధే శ్యాం మాత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డీలాప‌డిపోయింది. దాంతో ఇదొక సెంటిమెంట్‌గా భావిస్తున్నాడు వివేక్.

అందుకే ప్ర‌భాస్ యాక్ట్ చేస్తున్న స‌లార్ (salaar) సినిమాతో పాటే త‌ను డైరెక్ట్ చేస్తున్న ది వ్యాక్సిన్ స్టోరీ సినిమాను రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నారు. స‌లార్ సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ అవుతోంది. అదే రోజు ది వ్యాక్సిన్ స్టోరీ రిలీజ్ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అలా ఎందుకు అని అడిగితే.. లాస్ట్ ఇయ‌ర్ రాధే శ్యాంతో పాటు త‌న సినిమా రిలీజ్ చేస్తే బ్లాక్ బస్ట‌ర్ అయింద‌ని ఇప్పుడు కూడా స‌లార్‌తో పాటు త‌న సినిమాను రిలీజ్ చేస్తే ఇది కూడా సూపర్ హిట్ అవుతుంద‌ని అనుకుంటున్నార‌ట‌.

అలా అనుకోవ‌డంలో త‌ప్పు లేదు కానీ స‌లార్ కంటే త‌న సినిమానే బాగా ఆడుతుంద‌న్న ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ మాత్రం క‌రెక్ట్ కాదు. ఒక పెద్ద హీరోతో పాటు మ‌రో సినిమా రిలీజ్ చేయాలంటే డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూసర్లు చాలా ఆలోచిస్తారు. అవేవీ ఆలోచించ‌కుండా రిలీజ్ చేసేసి ఏది బాగుంటే జ‌నాలు అదే చూస్తారు అనుకునే ప్రొడ్యూసర్లు కూడా ఉంటారు. కానీ వివేక్ అలా కాదు. ప్ర‌భాస్ సినిమాతో పాటు త‌న సినిమా రిలీజ్ చేస్తే అత‌ని సినిమా ఫ్లాప్ అవుతుంది అనే దురుద్దేశంతో ఉన్నాడు. ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్టో అత‌నే ఆలోచించుకోవాలి.