Vishwak Sen: కాంట్రొవ‌ర్సీపై విశ్వ‌క్ రియాక్ష‌న్

Hyderabad: మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ (vishwak sen) ఎట్ట‌కేల‌కు కాంట్రొవ‌ర్సీపై రియాక్ట్ అయ్యారు. కొన్ని రోజుల నుంచి బేబీ (baby) డైరెక్టర్ సాయి రాజేష్‌..(sai rajesh) విశ్వ‌క్ గురించి ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆనంద్ దేవ‌ర‌కొండ (anand devarakonda) కంటే ముందు ఈ సినిమా స్టోరీని విశ్వ‌క్‌కి చెప్ప‌డానికి వెళ్తే అత‌ను క‌నీసం క‌థ వినే ఛాన్స్ కూడా ఇవ్వ‌కుండా వెళ్లిపోమ‌న్నాడ‌ని సాయి రాజేష్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. దీనిపై విశ్వ‌క్ స్పందిస్తూ.. నో మీన్స్ నో అనేది అబ్బాయిల‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని పేరు తీయ‌కుండా సాయి రాజేష్‌కి కౌంట‌ర్ వేసారు.

“” ఎంత పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా ఎంతో కొంత బిజీగా ఉంటాం. దాని వ‌ల్ల క‌ల‌వ‌లేం, క‌థ విన‌లేం అని చెప్తుంటాం. అంతేకానీ కించ‌ప‌ర‌చాల‌ని కాదు. నాకు బేబీ సినిమా క‌థ విన‌డానికి ముందే చేయాల‌ని లేదు. ఎందుకంటే ఆ టైంలో నేను వేరే ప‌నుల‌తో బిజీగా ఉన్నాను. క‌థ మొత్తం విన్నాక నో చెప్ప‌డం కంటే ముందే చెప్పేస్తే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది క‌దా అని నేను నో చెప్పాను. బేబీ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయినందుకు కంగ్రాట్స్. మ‌న సినిమా హిట్ అయితే త‌లెత్తుకుని తిర‌గాలే త‌ప్ప ఇంకొక‌రిని కించ‌ప‌ర‌చ‌డం క‌రెక్ట్ కాదు. నేను అంద‌రినీ ప్లీజ్ చేయ‌డానికి బిర్యానీని కాదు క‌దా “” అని ఈ వివాదానికి ముగింపు ప‌లికారు విశ్వ‌క్. (vishwak sen)