YSRTP: BRSలో ఉన్న ఎమ్మెల్యేలంతా మరో వనమాలే..!
Hyderabad: కొత్తగూడెం (kothagudem mla election) ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు (high court) సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ (ys sharmila) స్పందించారు. BRSలో ఉన్న ఎమ్మెల్యేలంతా మరో వనమా వెంకటేశ్వరరావులే అని ఆరోపించారు. అంతా ఎన్నికల కమీషన్‌ను తప్పు దోవ పట్టించిన వాళ్లేనని అన్నారు. దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలేనని ఆరోపణలు చేసారు.
“” ఎన్నికల అఫిడవిట్లో చూపింది గోరంతైతే దాచింది కొండంత. లెక్కకు రాని ఆస్తులు, అంతస్తులు అనంతం. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేసి, తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి YSR తెలంగాణ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఎన్నికల సంఘాన్ని మోసం చేసి అధికారం అనుభవిస్తున్న వారిని మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నాం “” అని తెలిపారు షర్మిళ.
కొత్తగూడెంలో కాంగ్రెస్ (congress) తరపున గెలిచిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని BRS తరపున పోటీ చేసిన జలగం వెంకట్ రావు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు 2018 ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది.