Kargil Vijay Diwas: ఈ విష‌యాలు తెలుసా..?

Hyderabad: కార్గిల్ యుద్ధంలో అమ‌ర‌వీరులైన మ‌న భార‌త సైనికుల‌ను ప్ర‌తి సంవ‌త్స‌రం జులై 26న వారి (kargil vijay diwas) త్యాగాల‌ను గుర్తుచేసుకుంటూ ఉంటాం. ఇండియ‌న్ మోడ్ర‌న్ మిలిట‌రీ హిస్ట‌రీలో కార్గిల్ యుద్ధం అనేది చిర‌స్థాయిగా నిలిచిపోతుంది. 1999లో జ‌రిగిన కార్గిల్ యుద్ధం గురించి ఈ ఇంట్రెస్టింగ్ విష‌యాలు మ‌నం త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి. అవేంటంటే..

*1999 మే 8న భార‌త్, పాకిస్థాన్ మ‌ధ్య ఈ కార్గిల్ యుద్ధం జ‌రిగింది. 1998లో పాక్ ఆర్మీ, ఇస్లామాబాద్‌కు చెందిన కొంద‌రు ట్రైబ‌ల్ మిలిటెంట్లు.. లైన్ ఆఫ్ కంట్రోల్ ద్వారా అక్ర‌మంగా భార‌త స‌రిహ‌ద్దుల్లోకి చొర‌బ‌డ్డారు. క‌శ్మీర్ వ్యాలీ ప్రాంతాన్ని ఆక్ర‌మించుకునేందుకు వారు చొర‌బ‌డిన‌ట్లు తెలీడంతో 1999లో యుద్ధం జ‌రిగింది.

*ఈ యుద్ధాన్ని ఇండియ‌న్ ఆర్మీ పెట్టిన సీక్రెడ్ కోడ్ నేమ్ ఆప‌రేష‌న్ విజ‌య్. (kargil vijay diwas)

*మొత్తం మూడు భాగాలుగా కార్గిల్ యుద్ధం జ‌రిగింది. ఒక భాగంలో పాక్ ఆర్మీ ఆక్ర‌మించుకున్న ప్రాంతాల‌ను మ‌ళ్లీ తిరిగి రాబ‌ట్టుకునేందుకు భార‌త ఆర్మీ ప్లాన్ వేసింది. రెండోది ఏ ప్రాంతాల్లో అయితే పాక్ ఆర్మీ త‌ల‌దాచుకున్నారో వారిని తిరిగి పాక్‌కి పంపించేందుకు. ఇక మూడోది మ‌రోసారి పాక్ ఆర్మీ ఎలాంటి భార‌త పాలిత ప్రాంతాల‌ను ఆక్ర‌మించుకోకుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్నారు.

*కార్గిల్ యుద్ధం జ‌రిగిన స‌మ‌యంలో వాతావ‌ర‌ణం అంత‌గా అనుకూలించ‌లేదు. అయినా కూడా భార‌త సైనికులు వెనుకాడ‌లేదు. 18,000 ఎత్తైన కొండ‌ల న‌డుమ‌, ఎముక‌లు కొరికే చలిలో భార‌త సైనికులు పోరాడారు.

*ఈ భీక‌ర యుద్ధంలో దాదాపు 500 మంది భార‌త సైనికులు అమ‌రుల‌య్యారు. అటు పాకిస్థాన్ నుంచి రూ.1000 సైనికులు చ‌నిపోయారు. (kargil vijay diwas)

*యుద్ధం కోసం భారీ ఆయుధాల‌ను భార‌త సైన్యం వాడింది. వాటిలో బోఫోర్స్ FH-77B హోవిట్జ‌ర్స్ కూడా ఉన్నాయి. ఈ యుద్ధంలో భార‌త సైన్యం మొత్తం 500 ఆర్టిల‌రీ షెల్స్, రాకెట్స్ వాడింది. దాదాపు 300 గ‌న్నుల నుంచి బాంబులు వ‌దిలారు. ఇందుకోసం ఇస్రాయిల్ కూడా మ‌న‌కు అన్‌మాన్డ్ ఏరియ‌ల్ వెహికిల్స్ ఇచ్చి ఎంతో సాయ‌ప‌డింది.

*మొద‌టిసారి ఏదైనా యుద్ధం టీవీల్లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అయిందంటే.. అది కార్గిల్ యుద్ధ‌మే.

*1971 త‌ర్వాత అంత‌టి స్థాయిలో భారీ యుద్ధం ఏదైనా చోటుచేసుకుందంటే అది కార్గిలే. (kargil vijay diwas)

*యుద్ధంలో అదృవ‌శాత్తు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన వీరుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గలాంట్రీ అవార్డుల‌తో స‌త్క‌రించింది. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ నుంచి కెప్టెన్ విక్ర‌మ్ బాత్రా ఈ యుద్ధంలో చ‌నిపోయారు. ఆయ‌న సేవ‌ల‌కు గుర్తుగా కేంద్రం ప‌ర‌మ వీర చ‌క్ర ఇచ్చింది.

*ఈ యుద్ధం అనంత‌రం మొత్తం ముగ్గురు అమ‌ర‌వీరుల‌కు ప‌ర‌మ వీర చ‌క్ర వ‌చ్చింది. 11 మ‌హా వీర చ‌క్ర అవార్డుల‌ను కూడా కేంద్రం ప్ర‌క్ర‌టించింది.