Oppenheimer: భారతీయులు భగవద్గీత చదవలేదు
Hyderabad: క్రిస్టొఫర్ నోలాన్ (christopher nolan) డైరెక్ట్ చేసిన ఓపెన్‌హైమర్ (oppenheimer) సినిమా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నోలాన్ ఇందులో సెక్స్ సీన్ పెట్టి.. హీరో సిలియన్ మర్ఫీ చేత భగవద్గీతలోని (bhagavad gita) ఓ శ్లోకం చెప్పించారని సినిమా చూసిన భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ శ్లోకాన్ని సినిమా నుంచి తొలగించకపోతే బాగుండదు అని హెచ్చరిస్తున్నారు. దీనిపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ram gopal varma) స్పందించారు. మన దేశంతో మన భాషతో సంబంధం లేని ఓపెన్‌హైమర్ భగవద్గీత చదివారు కానీ మన భారతీయుల్లో .0000001 శాతం మంది కూడా ఆ మహాకావ్యాన్ని చదవలేదని అన్నారు.
న్యూక్లియర్ అటామిక్ బాంబ్ కనిపెట్టిన సైంటిస్ట్ ఓపెన్‌హైమర్.. (oppenheimer) మొదటిసారి న్యూక్లియర్ టెస్ట్ చేపట్టినప్పుడు నేను ప్రపంచాలను అంతం చేసే చావునయ్యాను అని భగవద్గీతలోని ఓ శ్లోకాన్ని గుర్తుచేసుకున్నారు. అదే సీన్‌ను క్రిస్టొఫర్ నోలాన్ సినిమాలో వాడారు. కానీ సెక్స్ సీన్లో ఈ శ్లోకాన్ని వాడారని భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అది భగవద్గీతలోని శ్లోకం కాదని మరికొందరి వాదన.